MOVIE NEWS

జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా ఆ తరువాత దూసుకుపోయింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది..ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..?

నెట్ ఫ్లిక్స్  ఓటీటిలోకి వచ్చిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ రావడంతో ఈ సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. గ్లోబల్ వైడ్ గా మంచి రీచ్ రావడంతో ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాని ముందుగా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉన్న జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రం జపాన్ దేశంలో దేవర గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఎన్టీఆర్ కూడా జపాన్ లో ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు..ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ‘దావుడి’పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు ఈ పాట జపాన్ దేశం మొత్తం మారుమ్రోగిపోతుంది. రీసెంట్ గానే ఒక జపనీస్ జంట ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ ఒక రీల్ ని అప్లోడ్ చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రీల్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసారు

Related posts

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

murali

“ఫౌజీ” మ్యాజిక్ మాములుగా ఉండదు.. హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment