NTR Devara Movie 3 Days Worldwide Box Office Collections
MOVIE NEWS

అమ్ముడు పోని”దేవర” శాటిలైట్ హక్కులు.. కారణం అదేనా..?

గతంలో కొత్త సినిమాల థియేటర్ రన్ పూర్తి అయ్యాక ఎప్పుడెప్పుడు టీవీల్లోకి వస్తుందా అని ఇంటిల్లపాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. సదరు టీవీ ఛానల్ సైతం కొత్త సినిమా వచ్చేస్తుంది అంటూ చేసే ఆర్భాటం చాలా బాగుండేది.. ఇంట్లో వారంతా ఆ రోజు కొత్త సినిమాను టీవీలో చూస్తూ ఎంజాయ్ చేసేవారు.. కానీ కరోనా పుణ్యమా అంటూ సీన్ అంతా నరిపోయింది.. ఆ మహమ్మారి సమయంలో థియేటర్స్ మూతపడటంతో ప్రేక్షకులంతా ఓటిటిలకు మొగ్గు చూపారు..థియేటర్స్ లేని సమయంలో వరుస ఓటీటి సంస్థలు వెలిసాయి.. ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తూ సదరు ఓటిటి సంస్థలు బాగానే సొమ్ము చేసుకున్నాయి.. గతంలో కొత్త సినిమాల ప్రసార విషయంలో టీవీ చానెల్స్ దే హవా . ఏదైనా సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు హక్కులు కొనేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు నిర్మాతల దగ్గర క్యూ కట్టేవారు.

RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..?

టెలివిజన్ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఓటిటిలలో నాలుగు వారాల గ్యాప్ లో ఓటీటిలలోకి వచ్చేయడంతో ప్రేక్షకులు అంతా వాటికే అలవాటు పడిపోయారుదీంతో ప్రొడ్యూసర్లు అడిగినంత రేట్ ఇవ్వడానికి టీవీ ఛానల్స్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఎలాంటి యాడ్స్ లేకుండా ఓటిటి యాప్స్ లో ప్రేక్షకులు కొత్త చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. దీనితో టీవీల టిఆర్పి రేటింగ్స్ బాగా పడిపోయాయి. అందుకే శాటిలైట్ హక్కుల కోసం ఎక్కువ సొమ్మును ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నాయి.

కల్కి 2898 ఏడి ఈ సమస్యను ఎదురుకోవడం వల్లే చాలా ఆలస్యంగా టీవీలోకి వచ్చింది. ఇప్పుడు దేవర కూడా ఇబ్బంది ఎదుర్కుంటుంది . థియేటర్లో భారీ వసూళ్లను సాధించి నెట్ ఫ్లిక్స్ లో సూపర్ ట్రెండింగ్ గా నిలిచిన దేవర బుల్లితెరపై వచ్చేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తుంది.తాజా సమాచారం ప్రకారం దేవర శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. నిర్మాతకు ఛానల్స్ మధ్య సరైన డీల్ కుదరకపోవడంతో దేవర బుల్లితెర విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది..

 

Related posts

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

murali

విశ్వంబర సినిమా లో అ….అ…అ

filmybowl

“ఓజి” మూవీకి సెకండ్ పార్ట్..పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!!

murali

Leave a Comment