జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 22 విడుదలకు ముందు జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఒక స్టార్-స్టడ్డెడ్ కార్యక్రమంగా మలుచుకోనుంది. ఈ ఈవెంట్‌లో నలుగురు ప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు—ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్—జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర ప్రీరిలీజ్ స్టేజీ పంచుకోబోతున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి – ది గేమ్ చేంజెర్
బాహుబలి మరియు RRR లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రాల క్రియేటర్ ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన దర్శకుల్లో ఒకరు. RRR చిత్రంలో వారి సహకారం తెలుగు సినిమాపై మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా బలమైన ముద్ర వేసింది. ఈ దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ – ది విజనరీ
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రేరణాత్మక డైలాగ్స్ మరియు బలమైన కథనానికి పెట్టింది పేరు త్రివిక్రమ్. వారి ప్రాజెక్ట్ ఇంకా కంఫర్మ్ కాలేదు, కానీ ఈ ఇద్దరి కలయికలో మూవీ ఆశించి ఉన్న అభిమానులకు, దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ రావడం తో అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది.
కొరటాల శివ – ప్రస్తుత దర్శకుడు
దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రస్తుతం పనిచేస్తున్న కొరటాల శివ, గతంలో కూడా ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసి జనతా గ్యారేజి వంటి చిత్రాలు భారీ విజయాలన్నీ అందించారు. ఫీరి కలయికలో వస్తున్నా ఈ దేవర మరొక సూపర్ హిట్ చిత్రంగా ఉండాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు, ఇది యాక్షన్-ప్యాక్ డ్రామాగా రూపొందించిన సినిమా.
ప్రశాంత్ నీల్ – భవిష్యత్తు దర్శకుడు
కెజిఫ్, సలార్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది దేవర విజయానికి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మంచి యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులకి అందిస్తారు అని పేరు పొందిన నీల్, ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా రూపొందిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ఈ నలుగురు దర్శక దిగ్గజాలతో కలిసి, దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రేక్షకుల మదిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధంగా ఉంది.
నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!