MOVIE NEWS

‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తం గా సుమారు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!!

పార్ట్ 1 క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇవ్వడం తో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదరగొట్టింది.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేస్తుండటం తో దేవర 2 ఇంక ఉండదని ప్రచారం జరిగింది కానీ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చారు.. ఆ సినిమా పూర్తికాగానే దేవర 2 మొదలవుతుంది అని ఎన్టీఆర్ తెలిపారు..

ఇప్పటికే దేవర 2 సీక్వెల్ కథను సిద్ధం చేసిన కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు..పార్ట్ 2 లో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ కానున్నాయని సమాచారం..దేవర 2 మెదటి పార్ట్ లోనే మెయిన్ ట్విస్తులకు సమాధానం ఇవ్వనున్నారు…

Related posts

సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..?

murali

ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!!

murali

Leave a Comment