MOVIE NEWS

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన సినిమా ఇది.. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

అయితే ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.. ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది..

ఇదిలా ఉంటే త్వరలోనే మేకర్స్ దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు.. పార్ట్ 1 లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడింగ్ ఇచ్చిన మేకర్స్ పార్ట్ 2 లో మరిన్ని ట్విస్టులు జోడించనున్నట్లు సమాచారం..తాజాగా పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు సమాచారం.. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీ గా వున్న ఎన్టీఆర్.. ఆ తరువాత ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు.. ఆ తరువాత దేవర 2 షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం..

Related posts

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

murali

Leave a Comment