MOVIE NEWS

దేవర : జపాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవల దేవర సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.. ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలకు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవర సినిమాను ఈ నెల 28న జపాన్ లో విడుదల కాబోతోంది..

సంబరాల ఏటిగట్టు : బ్రిటీషు పాత్రలో శ్రీకాంత్.. పోస్టర్ అదిరిందిగా..!!

దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఇటీవల జపాన్ వెళ్లారు.. అక్కడి ప్రేక్షకులని ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన అక్కడి లాంగ్వేజ్ లో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరుస్తాడు.. తాజాగా జపనీస్ ను కూడా అలాగే సర్ ప్రైజ్ చేస్తున్నాడు.. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం 21,22 తేదీల్లో జపాన్ లో పర్యటించిన ఎన్టీఆర్ ఆ సందర్భంగా చాలా పదాలు జపనీస్ లోనే మాట్లాడి అక్కడి జనాలకూ షాక్ ఇచ్చాడు.

అందరూ బాగున్నారా అనే ఒక్క పదం తరహాలో కాకుండా చాలా ‘సెంటెన్స్’లు ఎన్టీఆర్ జపనీస్ లో మాట్లాడాడు. పైగా అక్కడి వాళ్లు అడిగిన ప్రశ్నలకు జపనీస్ లోనే సమాధానం కూడా చెప్పాడు. ఏదేమైనా ఎన్టీఆర్ కాస్త కాన్ సెంట్రేట్ చేస్తే ఆ భాష నేర్చుకోవడానికి కూడా పెద్ద టైమేం పట్టదేమో అనిపిస్తుంది.. అందుకే ఎన్ని పేజీల డైలాగ్ అయినా ఒక్కసారి చూస్తే ఎన్టీఆర్ చెప్పేస్తాడు అని అంటారు..నిజంగా ఇది ఎన్టీఆర్ కు దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి…

 

Related posts

వర , తంగం రిలేషన్ తేడాగే ఉందే

filmybowl

ప్రభాస్ “స్పిరిట్” లో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్..!!

murali

కన్నప్ప : ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment