MOVIE NEWS

దేవర : జపాన్ ప్రమోషన్స్ కు సిద్దమైన ఎన్టీఆర్.. పిక్ వైరల్..!!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు అయితే తెలుగు సినిమా సాంగ్స్ రీల్స్ గా చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వుంటారు..ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. మన తెలుగు హీరోలకు జపాన్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో మన స్టార్ హీరోలు వారి సినిమాలను జపాన్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ సినిమా జపాన్ లో రిలీజ్ కాబోతుంది… కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన దేవర సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం సాధించింది. ఏకంగా 500 కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!!

ఇప్పుడు దేవర సినిమా జపాన్ లో మార్చ్ 28న రిలీజ్ కానుంది. దీని కోసం ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ మీడియాకు వర్చువల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటో ఎన్టీఆర్ టీమ్ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చ్ 22న జపాన్ వెళ్లనున్నారు.

గతంలో ఎన్టీఆర్ RRR ప్రమోషన్స్ కూడా జపాన్ లో చేసారు..ఆ తర్వాత తన ప్రైవేట్ వెకేషన్ కి కూడా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లనున్నారు. దీంతో అక్కడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర సినిమా జపాన్ లో ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి..

Related posts

ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..?

murali

SSMB : మూడు పార్టులుగా మహేష్, రాజమౌళి మూవీ.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

తమన్ మాటలకు చిరూ రియాక్షన్.. ట్వీట్ వైరల్..!!

murali

Leave a Comment