NTR Devara Movie 3 Days Worldwide Box Office Collections
MOVIE NEWS

మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది.

ఆదిత్య 369 : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది మార్చి 28 న దేవర జపాన్ లో రిలీజ్ కానుంది. దేవర జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నాడు… జపాన్ లోని ఫ్యాన్స్ తో అలాగే అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవర ను ప్రమోట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వెర్షన్ ట్రైలర్ మరింత గ్రిప్పింగ్ గా మేకర్స్ కట్ చేశారు. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ కు వెళ్లనున్నాడు. ఎన్టీఆర్ తో పాటూ దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి దేవర జపాన్ లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

Related posts

థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!!

murali

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

murali

పుష్ప 2 : క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఇదిగో ప్రూఫ్..!!

murali

Leave a Comment