MOVIE NEWS

దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు..అయితే మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది..కానీ రిలీజ్ అయినా కొద్ది రోజులకు ఈ సినిమా టాక్ మారుతూ వచ్చింది.. ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఎన్టీఆర్ కెరీర్ లో దేవర మూవీ మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

‘ఫౌజీ’ దర్శకుడికి ప్రభాస్ మరో బిగ్ ఆఫర్..?

ఈ సినిమాలో దేవర, వర అనే రెండు విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించి మెప్పించాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈ అమ్మడు తంగం పాత్రలో అద్భుతంగా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది…ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్ అద్భుతమైన లీడ్ ఇచ్చింది..

ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ వున్నారు..సెకండ్ పార్ట్ లో మరిన్ని ట్విస్టులు ఉండేలా కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు.. మొదటి పార్ట్ లో దేవర గురించి ఎక్కువ సన్నివేశాలు చూపించగా.. రెండో పార్ట్ లో వర పాత్ర గురించి ఎక్కువగా చూపించనున్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో యతి పాత్ర హైలైట్ కానుంది..అలాగే ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. దేవర సినిమా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించగా.. అక్కడ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఈ అప్డేట్ ఇచ్చారు.. దేవర సీక్వెల్ ను ఈ ఏడాది చివరిలో గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు..

 

Related posts

నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!!

murali

“రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

గుంటూరు కారం నీ అదే దెబ్బేసింది కానీ, దేవరకు అది ప్లస్ అయింది

filmybowl

Leave a Comment