MOVIE NEWS

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినా లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్‌”.. అలాగే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతి వస్తున్నాం వంటి రెండు బిగ్గెస్ట్ మూవీస్ తో దిల్ రాజు సంక్రాంతి బరిలోకి దూకుతున్నాడు.. గేమ్ చేంజర్‌ జనవరి 10న విరుదలవుతుండగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.తన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.”గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా జరిగింది.

సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!!

అలా జరగటానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే..మేం అడగగానే ఈవెంట్‌కు రావడానికి ఆయన ఒప్పుకున్నారు..ఎంతో సంతోషం అనిపించింది. నా జీవితంలోనే అద్భుతమైన ఈవెంట్ అది అని నిర్మాత దిల్ రాజు అన్నారు.. గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పూర్తిచేయడంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం. 2021 ఆగస్టులో ప్రారంభమైన ఈ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం.దాదాపు నాలుగేళ్ల కృషికి మరో నాలుగు రోజుల్లో ఫలితం రానుందని అన్నారు. ”గేమ్ చేంజర్‌ సినిమాలో రామ్ చరణ్, ఎస్.జె. సూర్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉంటాయి.

చిత్రంలో కేవలం కమర్షియల్ అంశాలు కాకుండా మంచి మెసేజ్ కూడా ఉంటుందని దిల్ రాజు అన్నారు.ఈ సినిమాలో కేవలం పాటల కోసమే రూ. 75 కోట్ల ఖర్చు చేసినట్లు దిల్ రాజు తెలిపారు.. 2 గంటల 43 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేయడం మంచి పరిణామం అని దిల్ రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇచ్చినందుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి ప్రమాదానికి గురైన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు దిల్ రాజు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు…

Related posts

సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’

filmybowl

బాలయ్య షో లో ఆ స్టార్ హీరోకి ఫోన్ చేసిన చరణ్.. షాక్ అయిన ఫ్యాన్స్..!!

murali

రవితేజ : మరోసారి ‘ధమాకా’

filmybowl

Leave a Comment