మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తం గా సుమారు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..పార్ట్ 1 క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇవ్వడం తో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..A
A22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదరగొట్టింది.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేస్తుండటం తో దేవర 2 ఇంక ఉండదని ప్రచారం జరిగింది…ఇటీవల దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..
ఇదిలా ఉంటే దేవర 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయినట్లు సమాచారం. ఇందుకోసం ఒక స్పెషల్ వీడియో ని కూడా త్వరలో తయారు చేయబోతున్నారట. ఈ స్పెషల్ వీడియో ద్వారా ‘దేవర 2’ మొదలు అవుతుందని మేకర్స్ ఒక ప్రకటన చేస్తారని తెలుస్తుంది.. ఈ నెల 20 వ తేదీ న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట.