MOVIE NEWS

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యాయి. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవగా రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ అలాగే మూడో ఎపిసోడ్‌కు స్టార్ హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!!

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్‌ను మాత్రం మేకర్స్ రెండు భాగాలుగా విడుదల చేసారు.. ఈ రెండు భాగాలకు అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అలాగే రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక తరువాతి ఎపిసోడ్‌కు ఎవరు గెస్ట్ గా రానున్నారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి చేయనుంది.తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్పటికే శ్రీలీల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

స్లీవ్‌లెస్ టాప్‌, ఎరుపు, నలుపు కలిసిన చీరతో క్యారవాన్ ముందు నిలుచుకున్న శ్రీలీల పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి…అయితే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య షోకి శ్రీలీల రావడం ఇది రెండోసారి. గతంలో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ అగర్వాల్‌తో పాటు ఆమె ఈ షోకి వచ్చింది.తాజాగా శ్రీలీల పుష్ప 2 లో ‘’కిస్సిక్ “ అనే ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది..పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా శ్రీలీల ఈ షో కి వస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే.. ఈ షోకి హీరో నవీన్ పొలిశెట్టి కూడా వస్తున్నట్లు సమాచారం..కొన్నాళ్ళ క్రితం ఈ యంగ్ హీరోకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య షోతో అతడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సమాచారం..

Related posts

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!!

murali

హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..?

murali

Leave a Comment