ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకులలో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.. ఈ సినిమాకు మొదటి రోజు భారి ఓపెనింగ్స్ వచ్చాయి..దాదాపు 1700 కోట్ల కలెక్షన్స్ సాధించి పుష్ప 2 మూవీ చరిత్ర సృష్టించింది.. అయితే ఈ సినిమా కలెక్షన్స్ లో జోరు చుపిస్తున్నా కానీ టీం మాత్రం సంతోషంగా లేరు.. సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ ని ఆయన ఫ్యాన్స్ ని మానసికంగా కృంగదీసింది.. అల్లుఅర్జున్ ఈ అడ్డంకులన్నీ అధిగమించి మళ్ళీ వరుస సినిమాలు చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..
అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?
ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.. మేకర్స్ ఈ సినిమాలోని ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని “దమ్ముంటే పట్టుకోరా షెకావత్” థీమ్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేసారు.. థియేటర్ లో ఎంతగానో అలరించిన ఈ స్లోగన్ తో సాంగ్ కావాలని ఫ్యాన్స్ కోరగా తాజాగా మేకర్స్ వారి కోరిక తీర్చారు..
తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఫిబ్రవరి నెల సెకండ్ వీక్ లో ఉంటుందని సమాచారం..ఈ సినిమా ఓటిటి రైట్స్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది..ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం ముగిసాక అల్లుఅర్జున్ ఈ సినిమా గురించి కీలక విషయాలు తెలియజేయనున్నట్లు సమాచారం..