MOVIE NEWS

డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..చాందిని చౌదరి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది….అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది.

ఎస్ఎస్ఎంబి : రెండు పార్టులుగా మహేష్ సినిమా..రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్,అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు… టైటిల్ టీజర్ లో తమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని చిత్ర యునిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా వున్నారు..కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అందులో భాగంగా డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పడనేది ప్రకటించకుండా డాకు ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది, బ్లాక్ బస్టర్ తమన్, బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు అని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది.. గతంలో తమన్ సంగీతం అందించిన బాలయ్య సినిమాలు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో డాకు మహారాజ్ సాంగ్స్ అంతకు మించి వుంటాయని సమాచారం.

Related posts

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

రామాయణాన్ని ఇలా వాడేశారు

filmybowl

నేను కాపీ చేసే రకం కాదు.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment