నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటించారు.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు..ఈ సినిమా ట్రైలర్ లో బాలయ్య నట విశ్వ రూపాన్ని చూపించాడనే చెప్పాలి.ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నా దర్శకుడు బాబీ మాత్రం ఈ ట్రైలర్ లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమా కథ మొత్తాన్ని ఈ ట్రైలర్ లో రివిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక పీడిత ప్రాంతాన్ని డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ వెళ్లి ఎలా సేవ్ చేశారు అనేదే ఈ సినిమా కథగా ఈ ట్రైలర్ చూస్తేనే చాలా క్లియర్ గా తెలుస్తోంది.
అలాగే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు..మరి సినిమాలోనైనా బాలయ్య కి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాబీ మరోసారి బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది…