MOVIE NEWS

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు…

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది… మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలో మేకర్స్ ప్రచారం పనులు సైతం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు.ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్లు,రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ తో ప్రేక్షకులలో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.దీంతో ‘డాకు మహారాజ్’ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్ చిత్ర యూనిట్ రివీల్ చేశారు.

గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..?

ఈ మేరకు ‘ఒక హై-ఆన్ ఎనర్జీ & ఫియర్స్ ట్రాక్ మీ ముందుకు రాబోతోంది.. ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ డిసెంబర్ 14న విడుదల కాబోతుంది. అలాగే ఈ సాంగ్ ప్రోమోను రేపు ఉదయం 10:08కి రాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది..ఇదిలా ఉంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా “ అఖండ 2- తాండవం “సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమాను బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తుండగా 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది..

Related posts

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌….

filmybowl

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

Leave a Comment