MOVIE NEWS

డాకు మహారాజ్ : అక్కడి ప్రేక్షకులకు బాలయ్య సినిమా తెగ నచ్చేసిందిగా..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాకు టాక్ బాగున్నా కానీ ఆశించిన కలెక్షన్స్ అయితే రాలేదు.. రీసెంట్ గా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మలయాళీ, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అయ్యారు… గతంలో తమిళ మలయాళ ప్రేక్షకులు బాలయ్య ని కేవలం ట్రోల్ మెటీరియల్ లా మాత్రమే చూసేవారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత వారంతా బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కంటే మలయాళ ప్రేక్షకులే ఎక్కువగా డాకు మహారాజ్ సినిమా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ విషయంలో వెనుకబడ్డ విజయ్ దేవరకొండ.. కారణం అదేనా..?

అయితే మలయాళంలో అల్లు అర్జున్ కి సూపర్ క్రేజ్ ఉంది. కానీ పుష్ప2లో స్విమ్మింగ్‌ఫూల్‌ సీన్‌లో ఫహద్ ఫాసిల్ పాత్రను దారుణంగా అవమానించడంతో మాలయాళీలు హర్ట్‌ అయ్యారు.. దీనితో పుష్ప 2 మీద వారు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు.అయితే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ పైనే విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు.. ఆ సినిమాలో బాలయ్య పాత్రను రోస్ట్ చేస్తూ మలయాళ యూట్యూబర్ ఒకరు యూట్యూబ్లో వీడియో పెడితే ఆ వీడియో కింద బాలయ్య ని సపోర్ట్ చేస్తూ యూట్యూబర్ పై కామెంట్స్ తో ఎదురు దాడి చేస్తున్నారు..

అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా లాంటి దేశాలలో కూడా ఈ సినిమా సూపర్ ట్రెండ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. కానీ వెంకీ మామ “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా బాగా డామినేట్ చేసింది..

 

Related posts

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ?

filmybowl

గ్లోబల్ స్టార్స్ తో తమన్ ధోప్ మూమెంట్.. పిక్ వైరల్

murali

Leave a Comment