నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ” డాకు మహారాజ్”. స్టార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ రోజు డాకు మహారాజ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో బాలయ్య లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా ట్రైలర్ సరికొత్త విజువల్స్ తో గ్రాండియర్ గా ఉందని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా విజయ్ కన్నన్ సినిమాటోగ్రాఫీ అలాగే తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడు బాబీ టేకింగ్ కు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి …
కొండ దేవర సాంగ్ కి ఊహించని రెస్పాన్స్.. సినిమాకే కీలకం కానుందా..?
కాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో గ్రాండ్ గా జరుగుతుంది.. ఈ ఈవెంట్ కి డల్లాస్ లో బాలయ్య అభిమానులు భారీగా చేరుకున్నారు..ఇక తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ మూవీకి సంబంధించి రెండు భారీ ఈవెంట్స్ ను నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి బాలయ్య ఎంఎల్ఏ గా గెలిచిన అనంతపురం జిల్లాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఆ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య పెద్ద అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రాబోతున్నట్టు సమాచారం. మామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లుడు రానుండడంతో డాకు మహారాజ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు భారీగా చేయబోతున్నట్లు తెలుస్తుంది.. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.