MOVIE NEWS

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు.ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.బాలయ్య 109 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.” డాకు మహారాజ్” అనే పవర్ఫుల్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు.

ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ లో తమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమాలో విలన్ గా యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నాడు.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ సినిమా కోసం రంగంలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్.. జక్కన్న ప్లానింగ్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాలో అసలు విలన్ బాబీ డియోల్ కాదని బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. బాలయ్యే ఇటు హీరోగా, అటు విలన్ గా మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో అదరగొట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే బాలయ్యకు విలన్ పాత్ర కొత్తేమి కాదు.గతంలో బాలయ్య సుల్తాన్ సినిమాలో హీరోగా ,విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు.ఆ సినిమా కమర్షియల్ గా అంతగా ఆడకపోయిన బాలయ్య పెర్ఫార్మన్స్ మాత్రం అదిరిపోతుంది.దీనితో డాకు మహారాజ్ లో కూడా బాలయ్య నట విశ్వరూపం చూపించారని సమాచారం.

Related posts

పుష్ప2 టైటిల్ సాంగ్ రిలీజ్.. డిలీటెడ్ సీన్స్ అదిరిపోయాయిగా.!!

murali

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

murali

ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

filmybowl

Leave a Comment