నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘. స్టార్ డైరెక్టర్ బాబి తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అన్నింటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా తెరకెక్కించినట్లు సమాచారం.
నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!!
తాజాగా రిలీజ్ అయినడాకు మహారాజ్ ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచింది. హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు మీదున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం గ్యారెంటీ గా కనిపిస్తుంది..ఈ సినిమాలో ఒక్క యాక్షన్ షాట్‌కి కూడా బాలకృష్ణ డూప్‌ని వాడలేదంటూ దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో ఊహించని అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక ఈ మూవీకి రూ.70 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను మూవీ టీం ఫిక్స్ చేశారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి ఏపీ విద్యా శాఖ మంత్రి, బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మామ, అల్లుళ్లు ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారు.. ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.