MOVIE NEWS

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ “ డాకు మహారాజ్“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. ఊర్వశి రౌటెల, చాందినీ చౌదరి, శ్రద్దా శ్రీనాధ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అన్ ప్రిడిక్టబుల్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ సాంగ్ విడుదలైంది. ‘డాకు మహారాజ్’ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ సాంగ్ ‘దబిడి దిబిడి’ని తాజాగా మేకర్స్ విడుదల చేసారు..విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు.

అలాంటి బాలకృష్ణ నటించిన సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ తో రూపుదిద్దుకున్న ‘దబిడి దిబిడి’ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా డాన్స్ అదరగొట్టింది..అదిరిపోయే మాస్ స్టెప్పులతో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది..తమన్ ఈ సాంగ్ కి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా వుంది.. జనవరి 4 న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది..ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో అఖండ సినిమాకు సీక్వెల్ మూవీలో నటిస్తున్నాడు..

Related posts

అమ్మో..శంకర్ డ్రీం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

murali

మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

filmybowl

అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ?

filmybowl

Leave a Comment