గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని బాబీ అనుకున్నారట.ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను పెట్టలేదని ఇటీవల బాబీ తెలిపారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని సమాచారం.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని సమాచారం.
చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!
క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ నడుస్తోందని సమాచారం..బాలయ్య సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించే ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..”డాకు మహారాజ్” సినిమాలో . బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటెల కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు..
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.. ఈ ట్రైలర్ లో బాలయ్య మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.. అయితే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే ప్రేక్షకులు స్టన్ అయిపోతారని నిర్మాత నాగావంశీ ఇచ్చిన ఎలివేషన్ కు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు..