మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించాడు..ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఎన్టీఆర్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది “ దేవర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.గత ఏడాది సెప్టెంబర్ 27 న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే ఆ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది..కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఆ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!!
దేవర సినిమాను జపాన్ లో కూడా విడుదల చేస్తున్నారు. జపాన్ లో భారీ ప్రమోషన్స్ కూడా చేయనున్నారు. దేవర జపాన్ వెర్షన్ మార్చి 28న ఆ దేశంలో రిలీజ్ కానుంది.జపాన్ లో దేవర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొత్త మూవీకి సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ వైరల్ అవుతుంది… జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ కి నెల్సన్ జైలర్ మూవీతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల వరకు వసూలు చేసింది. జైలర్ సినిమాతో నెల్సన్ కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా ఎదిగాడు..
గత కొంత కాలంగా ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ చేయనున్నాడని న్యూస్ వైరల్ అయింది.. ఎట్టకేలకు వీరి కాంబోలో భారీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తుంది..ఎన్టీఆర్-నెల్సన్ కాంబోలో వచ్చే భారీ మూవీకి ‘రాక్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడని సమాచారం..