ప్రస్తుతం సౌత్ సినిమాల రేంజ్ పెరిగింది.. గతంలో బాలీవుడ్ సినిమాలు సౌత్ లో రికార్డు కలెక్షన్స్ సాధించేవి..సౌత్ సినిమాలు బాలీవుడ్ లో అంతగా ప్రభావం చూపించేవి కాదు..కానీ ఇప్పుడు సౌత్ సినిమాల స్థాయి పెరగడంతో బాలీవుడ్ లో సౌత్ సినిమాలు క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో వుంది.. ఈ మధ్య కాలంలో సౌత్, నార్త్ మూవీస్ మధ్య బిగ్గెస్ట్ ఫైట్ జరగలేదు.గతంలో డంకీ, సలార్ చిత్రాలు తీవ్రంగా పోటీ పడ్డాయి.. రెండు సినిమాలు హిట్ అయినా ప్రభాస్ నటించిన సలార్ పై చేయి సాధించింది..బాలీవుడ్ బాక్సాఫీసును సైతం సలార్ మూవీ షేక్ చేసింది.సరిగ్గా ఏడాదిన్నర కాలం తరువాత మళ్ళీ బిగ్గెస్ట్ స్టార్ వార్ ఆగస్టు 14న జరగబోతుంది. రెండు మల్టీస్టారర్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వార్‌కు దిగబోతున్నాయి..
‘బింబిసార 2’ నుంచి అందుకే తప్పుకున్నా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
వీటిలో తలైవా రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంది.. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై మేకర్స్ హైప్ ను పెంచారు.. హైదరాబాద్‌లో ఈ నెల 22న మరొక సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు..కూలీతో పాటు వార్ 2 బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది..కానీ ప్రమోషన్లలో మాత్రం కూలీ కంటే వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ పోస్టర్స్ తుస్సుమంటున్నాయి.. యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్మ ఈ సినిమా ప్రమోషన్లలో మాత్రం ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదు.
అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టేసిన చిత్ర యూనిట్ ఈ వీకెండ్ లేదా నెక్ట్స్ వీక్ నుండి ప్రమోషన్లను స్టార్ట్ చేయనుందని తెలుస్తుంది..వార్ 2 నుంచి ట్రైలర్ లేదా సాంగ్ రిలీజ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్, తారక్ లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు వేరే లెవెల్ లో వున్నాయి.. మరి ఈ రెండు సినిమాలో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.
