ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీనిక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ లో సూపర్ బజ్ తెచ్చుకుంది..ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి..అయితే ఈ మూవీ రిలీజ్ కు ఒక్కరోజు ముందు మేకర్స్ ప్రీమియర్స్ వేశారు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా..?
ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లారు.ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసెయ్యడంతో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ చాలా సీరియస్ అయ్యింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసింది.. దీనితో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు..పోలీస్ స్టేషన్ కి వెళ్లిన గంటలోనే బెయిల్ కూడా రావడం ఒక రాత్రంతా జైలులోనే ఉండి ఉదయాన్నే అల్లుఅర్జున్ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు..
తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన పై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.. అల్లుఅర్జున్ ఒక రాత్రి జైలుకు వెళ్లి రావడంతో సినిమా స్టార్స్ అంతా ఆయనని పరామర్శించేందుకు క్యూ కట్టారు.. అయనకేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? ఒక్కసారిగా అందరూ ఆయన చూసేందుకు వెళ్లారు.. అని రేవంత్ రెడ్డి విమర్శించారు..తొక్కిసలాటలో గాయపడ్డ చిన్న పిల్లాడు శ్రీ తేజ్ ని ఒక్క స్టార్ కూడా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.. అయితే తాజాగా సీనియర్ హీరో జగపతి బాబు తాను ఆ బాబుని వెళ్లి పరామర్శించానని ఈ విషయం ఎవరికీ తెలీదని తెలిపారు.. ఇలాంటి విషయాలు పబ్లిసిటీ చేసుకోవడం తనకు ఇష్టం లేదని జగపతిబాబు వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు..
I visited the affected family on humanitarian grounds. The boy might recover, and there are very good chances. Let's hope for the best.
– #JagapathiBabupic.twitter.com/Sl7h0Kvf4f
— Gulte (@GulteOfficial) December 22, 2024