Complete actor in Kantara 2
MOVIE NEWS

‘కాంతారా2’లో…. మరో స్టార్ హీరో…. ఎవరంటే????

Complete actor in Kantara 2
Complete actor in Kantara 2

Kantara 2 : ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అందరూ కన్నడ ఇండస్ట్రీ గురించి, అక్కడి హీరోల గురించే మాట్లాడుకున్నారు. అలా ఆ ఊపు ని కొనసాగిస్తు మరో సారి కన్నడ ఇండస్ట్రీని వార్తల్లో నిలుపుతూ కన్నడ సినిమా ఖ్యాతిని పెంచేసింది ‘కాంతారా’ సినిమా.

ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రీక్వెల్ గా ‘కాంతారా 2’ అనే సినిమాని తెరపైకి తీసుకురాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కాంతారా లో ప్రధాన పాత్ర పోషించిన రిషబ్ శెట్టి మెయిన్ రోల్ చేస్తున్నారు.

అలాగే ఈ ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి తో పాటుga మరో స్టార్ హీరో భాగం కాబోతున్నాడు అనే వార్త బయటకి వచ్చింది. మరి ఆ స్టార్ హీరో ఎవరు? అనే టాపిక్ లోకి వెళ్తే…

ఏమాత్రం అంచనాలు అనేవి లేకుండా రిలీజ్ అయి, దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ‘కాంతార’ కేవలం హిందీ లో 100 కోట్లు కొల్లగొట్టేసింది. ఈ సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా మూడు పాత్రలని అద్భుతంగా నిర్వర్తించాడు రిషబ్ శెట్టి.

ఇక ప్రస్తుతం ‘కాంతర 2’ మూవీని తీసే పనిలో పడ్డారు. కానీ ఈ మూవీ కాంతారా కి సీక్వెల్ కాదు ప్రీక్వెల్. అంటే ‘కాంతార’ సినిమాలో మనం చూసిన స్టోరీకి మునుపు జరిగిన కథ చెప్తారన్న మాట. ఇది కూడా భారీ బడ్జెట్ లోనే రిషబ్ శెట్టి రూపొందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కొంత మంది బడా స్టార్లు నటించబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Read Also : మహేష్ తో  ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

ముఖ్యంగా వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు
మలయాళం ఇండస్ట్రీ సూపర్ స్టార్ మోహన్ లాల్.

ఇప్పుడు ఈ వార్త ఇంతగా ప్రాచుర్యం పొందటానికి రీసన్ ఇటీవలే రిషబ్…. మోహన్ లాల్ ని కలిశారు. పైగా ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో
కూడా షేర్ చేయడంతో ‘కాంతార 2’ మూవీలో లాల్ కీలక పాత్రను పోషిస్తున్నారు అనే మాటకి బలం చేకూరింది.

మోహన్ లాల్ కు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా సైడ్ క్యారెక్టర్లు పోషించడానికి ఇలాంటి పెద్ద స్టార్స్ ఇష్టపడరు. కానీ మోహన్ లాల్ మాత్రం వీళ్ళందరికీ బిన్నం…. కంటెంట్ బాగుందంటే చాలు పాత్ర ఎలాంటిదైనా చేయడానికి వెనకాడరు అనేది మోహన్ లాల్ గతం లోనే నిరూపించారు. NTR తో కలిసి నటించిన ‘జనతా గ్యారేజ్’ , తమిళ్ హీరో విజయ్ తో చేసిన జిల్లా పృథ్విరాజ్ తో చేసిన ‘బ్రో డాడీ’ సినిమాలే నిదర్శనం

మరిప్పుడు ‘కాంతార’ సినిమాలో లాల్ ఎలాంటి పాత్ర చేస్తున్నారు అని చాలా ఊహాగానాలు బయటకి వస్తున్నాయి. వాటిల్లో బాగా జనాల్లోకి వెళ్ళింది రిషబ్ శెట్టికి తండ్రిగా మోహన్ లాల్ నటిస్తున్నాడట అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కానీ దీనిపై ఇంకా సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు.

మరి ఈ పూకారుల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా కామ్ గా ఉండాల్సిందే. ఏదైనా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కాంతారా లో చేస్తే బాగుంటది కదు….

Follow us on Instagram

Related posts

పుష్ప 2 : క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఇదిగో ప్రూఫ్..!!

murali

ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..?

murali

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

filmybowl

Leave a Comment