Uncategorized

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!!

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో f2,f3 వంటి ఫుల్ ఫన్టాస్టిక్ మూవీస్ వచ్చాయి.. అయితే ఆ రెండు సినిమాలలో వెంకీ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు.. ఇప్పుడు వెంకీ మామనే సోలో హీరోగా బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి ప్లాన్ చేసాడు.. “సంక్రాంతి వస్తున్నాం”అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ సినిమాకు మేకర్స్ ఫిక్స్ చేసారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ వెరైటీగా ప్లాన్ చేసారు..ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అనిల్ రిలీజ్ చేస్తున్న వీడియోలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే గోదారి గట్టు, మీను.. అనే రెండు పాటలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.లేటెస్ట్ గా మరో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ తో కూడా మేకర్స్ ఈ సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేలా చేశారు. ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన ఒక వీడియోలో దర్శకుడు అనిల్‌ రావిపూడి, వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో హైలెట్ అయ్యారు.

మూడో పాటకు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి స్టార్ సింగర్ ను తెప్పించాలని దర్శకుడు అనిల్ భీమ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.అయితే ఇంతలో వెంకటేష్ వచ్చిన నేను పాడతాను అంటూ చెబుతాడు..మొదట ఈ పాటకు బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడిని తీసుకురావాలని అనిల్‌ రావిపూడి అంటుండగామళ్ళీ వెంకటేశ్‌ వచ్చి నేను పాడుతా అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు.. ఇక తట్టుకోలేక అనిల్ చిరాకుతో మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ పాడించేయ్ వయ్యా ఆయనతోనే పాడించేయ్ అంటూ చిరాకు పడతాడు.ఫైనల్ గా విక్టరీ వెంకటేశ్‌ మరోసారి తన స్వరంతో అభిమానులను అలరించడానికి సిద్ధం అయ్యారు. సంక్రాంతి పండుగను ఉద్దేశించి తెరకెక్కుతున్న ఈ ఫెస్టివల్‌ సాంగ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ పాటను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీలో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సాంగ్ తెరకెక్కుతోంది.

Related posts

రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్

murali

Leave a Comment