MOVIE NEWS

“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ అంతా కలిసి పండుగను సెలెబ్రేట్ చేసుకుని సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడతారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మూవీ విడుదలయి దాదాపు అయిదు రోజులు అవుతున్నా ఇంకా చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది.

రాబోయే పదేళ్లలో సుకుమార్ చేసేది కేవలం 3 సినిమాలేనా..?

అయితే ఇలాంటి ఫ్యామిలీ కథలతో సీక్వెల్స్ చేయడం అనిల్ రావిపూడికి అలవాటే. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను అనిల్ రావిపూడి అలరించాడు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ను కూడా సీక్వెల్ చేయాలనుకునే ఆలోచనతో క్లైమాక్స్‌లో తానే స్వయంగా వచ్చి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు.’సంక్రాంతికి వస్తున్నాం’సినిమాలో మాజీ పోలీస్ గా వెంకటేశ్ నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేశ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ నటించారు. ఈ ముగ్గురి పాత్రలతో ఇంట్రెస్టింగ్ స్టోరీ క్రియేట్ చేసి ఫన్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి ప్రేక్షకులకు అందించాడు.. అయితే సీక్వెల్ ఈ క్యారెక్టర్స్ ఇలాగే ఉంచేసి.. వేరే కథతో పార్ట్ 2 తెరకెక్కించే ఛాన్స్ ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు.

”సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ చేసే స్పేస్ ఉంది. ఇందులో బాగా వర్కవుట్ అయ్యే కంటెంట్ ఉంది. దీనికి వేర్వేరు పరిస్థితులు కూడా యాడ్ చేయవచ్చు. ఈ సినిమాను రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి మళ్ళీ అక్కడి నుండే సీక్వెల్ మొదలుకావచ్చు. మరో అద్భుతాన్ని ఈ సీక్వెల్ క్రియేట్ చేయవచ్చు” అని చెప్పుకొచ్చాడు..’సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. అలాగే ఈ సీక్వెల్ 2026 కానీ 2027 కానీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది..

Related posts

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

murali

‘జై హనుమాన్’ లో నటించేది ఆ దర్శకుడేనా????

filmybowl

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

murali

Leave a Comment