నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.. నాలుగు రోజుల్లోనే బాలయ్య సినిమా 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్ళింది.. ఈ సందర్బముగా శుక్రవారం డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరిగింది.. డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంచలన వ్యాఖ్యలు చేసారు..తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.సక్సెస్ అనేది ఎంత డబ్బు పెట్టిన దొరకదు. అది వచ్చినప్పుడు ఇచ్చే కిక్ వేరుగా ఉంటుంది… మన జీవితంలో ఆ సక్సెస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సక్సెస్ లేకపోతే నేను ఫిలిం నగర్‌కి కూడా వెళ్లేవాడిని కాదేమో..అయితే ఒక సక్సెస్ వచ్చిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నిర్మాతలకు దైర్యం చాలడం లేదు..అలా చేబితే అతడిపై నెగిటివ్‌గా ట్రోల్ చేయడం.. నెగిటివ్‌గా ట్రెండ్ చేయడం జరుగుతుంది. మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ వలన నిర్మాతల జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి.
స్పిరిట్ : మూగవాడిగా ప్రభాస్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
అసలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతుంది. ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన తెలుగులో ఒక సినిమా చేయాలి అని వారు అడుగుతున్నారు. మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏం బ్రతుకు బ్రతుకుతున్నాం అనేది అర్థం కావాట్లేదు. విపరీతమైన ట్రోల్స్ వలన చాలా బాధగా ఉంది. ఒక సక్సెస్‌ని నిజంగా చెప్పుకోలేకపోవడం ఎంత దురదృష్టకరం. మీరు పర్సనల్‌గా కొట్టుకొండి కానీ ప్లీజ్ సినిమాను చంపేయకండి. నేను అదే వేడుకుంటున్నాను అంటూ తమన్ చెప్పుకోచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతలా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందని మెగాస్టార్ ట్వీట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది ..
Dear @MusicThaman
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025