MOVIE NEWS

ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా” డ్రాగన్”..కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో క్యూరియస్ గా వున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎన్టీఆర్ పై కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంది.ఎన్టీఆర్, నీల్ ఫ్యామిలీస్ చాలా క్లోజ్..

పవర్ స్టార్ వీరమల్లు మూవీ బిగ్ అప్డేట్..!!

ఇక ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ తమ ఫ్యామిలీస్‌కు పూర్తి టైం కేటాయిస్తుంటారు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నీల్ తమ భార్యలతో సరదాగా ఉన్న ఫోటోలను తమ ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేయగా ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్‌లకు బ్రేక్ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ వేస్తుంటారు.

తాజాగా.. ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ బ్రేక్ టైంలో వీరు తమ ఫ్యామిలీస్ తో సందడి చేశారు.ఎన్టీఆర్, నీల్ వారి ఫ్యామిలీస్‌తో ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, ‘డ్రాగన్’ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా మేకర్స్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Related posts

నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది….

filmybowl

తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

murali

Leave a Comment