గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘రంగస్థలం’.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, వై రవిశంకర్, సి.వి మోహన్ ఈ సినిమాను నిర్మించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జగపతి బాబు,ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, యాంకర్ అనసూయ వంటి వారు కీలక పాత్రలలో నటించారు..2018లో గ్రాండ్ గా విడుదలై ఈ సినిమా ఊహించని రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది. భారీగా కలెక్షన్లు సైతం రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.
రంగస్థలం : రాంచరణ్ కల్ట్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు..!!
రంగస్థలం మూవీ లో రామ్ చరణ్,సమంత నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు… ఎంతోమంది ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూసారు…సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాడు.ఈ సినిమాతో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది.. మళ్లీ సుకుమార్, చరణ్ కాంబోలో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చి 7సంవత్సరాలు పూర్తి అయింది… తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకధీరుడు రాజమౌళి ‘రంగస్థలం’సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
”నేను రామ్ చరణ్ కలిసి చేసి సినిమా ‘మగధీర’. నాకు అతనికి ఇదే బిగ్గెస్ట్ చిత్రం.కానీ నేను ‘రంగస్థలం’ మూవీ చూశాక నిజంగా షాక్ అయ్యాను. రామ్ చరణ్ ఫి నామినల్ యాక్టర్ అని అస్సలు ఊహించలేదు. ఆయన అంతలా ఎలా నటిస్తున్నాడని అనుకున్నాను” అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
https://twitter.com/AlwaysKrishh/status/1906250763216806212