MOVIE NEWS

ఆ బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చరణ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో టోటల్ రన్ లో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలిచింది.. గేమ్ ఛేంజర్ సినిమా కోసం రాంచరణ్ మూడు నాలుగేళ్లు కష్టపడ్డాడు కానీ రిజల్ట్ వేరేలాగా వచ్చింది.. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు..ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో “RC16” మూవీ చేస్తున్నాడు.

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పిరిట్ టీం బంపర్ ఆఫర్..!!

ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా కానుకగా రిలీజ్ చేసేలా మేకర్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే రాంచరణ్ సుకుమార్‌తో RC 17 మొదలు పెట్టనున్నాడు. పుష్ప2 సినిమాతో ఫుల్ ఫామ్ లో వున్న సుకుమార్ ఈసారి రామ్ చరణ్‌తో రంగస్థలంకి మించి అదిరిపోయే మాస్ మూవీ చేయనున్నట్లు సమాచారం.సుకుమార్ సినిమా తర్వాత రాంచరణ్‌ ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌ చెప్పిన కథకు ఓకె చెప్పాడని న్యూస్ బాగా వైరల్ అయింది..ఇదిలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది… బాలీవుడ్‌లో ‘కిల్’ అనే మూవీ చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే… ఈ సినిమాకు నిఖిల్‌ నగేశ్‌ భట్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది..

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌కి బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీనితో నిఖిల్‌ నగేశ్‌ భట్‌ తో రాంచరణ్ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది… గత కొంత కాలంగా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.. ఇది నిఖిల్ నగేశ్ భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమాచారం.. బిగ్గెస్ట్ మైథాలాజికల్ మూవీగా రాబోతున్నట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం.. మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే..

 

Related posts

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

murali

ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

murali

ఒకే టైటిల్ తో ఇద్దరి హీరోల మూవీస్.. ఒకే రోజు అనౌన్స్మెంట్..!!

murali

Leave a Comment