గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ దిల్ రాజుకి ఈ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది.. రిలీజ్ కి ముందు భారీ హైప్ వున్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.. అలాగే శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2 ‘దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడింది..ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు.అయితే శంకర్ ప్రతీ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు..
శంకర్ స్టోరీ నేరేషన్ కి తగ్గట్టు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు.. అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ వేరే సినిమాలలో బిజీగా ఉండటం పైగా తెలుగు సినిమా కావడంతో తమన్ అయితే బాగుంటుంది అని అంతా రెఫెర్ చేయడంతో శంకర్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.. గతంలో శంకర్ తీసిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.. కానీ గేమ్ ఛేంజర్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..
తాజాగా ఈ విషయం పై స్పందించిన తమన్..ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.. గతంలో వచ్చిన “ అల వైకుంఠపురం” సినిమాలో సాంగ్స్ కి అంత క్రేజ్ రావడానికి అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు..ఒక పాట సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ ఎంత ముఖ్యమో కొరియోగ్రఫీ కూడా అంతే ముఖ్యమని తమన్ అన్నారు.. ప్రస్తుతం తమన్ కామెంట్స్ పై చరణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు..ఈ నేపథ్యంలోనే తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది..ఆ కామెంట్స్ కి హర్ట్ అయిన చరణ్ తమన్ ను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినట్టు సమాచారం. దీంతో ఈ విషయంపై చరణ్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తూ తమన్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు..