నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. అలాగే హోస్ట్ గా కూడా బాలయ్య అదరగొడుతున్నాడు. ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో నాలుగో సీజన్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది..ఈ సీజన్ లో సీఎం చంద్రబాబు, తమిళ స్టార్ సూర్య , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్ మరియు శ్రీలీలతో పాటు పలువురు సినీ తారలు సందడి చేశారు. ఇక, తాజాగా ఈ షోకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్ కోసం బాలయ్య టాక్ షోలో చెర్రీ సందడి చేశారు.
గేమ్ ఛేంజర్ : ట్రైలర్ రిలీజ్ వాయిదా.. మండిపడుతున్న ఫ్యాన్స్..?
ఇక ఈ ఎపిసోడ్ లో చరణ్ స్నేహితుడు శర్వానంద్ కూడా సందడి చేయనున్నాడు. ఈ షో సందర్భంగా తన మిత్రుడు, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు చరణ్ ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. సరదాగా బాలయ్య ప్రభాస్ తో కలిసి చరణ్ కబుర్లు చెప్పారని తెలుస్తోంది. గతంలో అన్ స్టాపబుల్ షోకు వచ్చిన ప్రభాస్ చరణ్ కి కాల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభాస్ సీక్రెట్లన్నీ చెప్పేసిన చరణ్ ఇప్పుడు తన సీక్రెట్ లను ప్రభాస్ చెబుతాడేమో అని భయపడినట్లు సమాచారం.. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అలాగే రాంచరణ్ నటించిన “ గేమ్ ఛేంజర్ “ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రాంచరణ్ ని సోలో హీరోగా తెరపై చూసి చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆత్రుతతో వున్నారు.. అదిగాక ఈ సినిమాలో చరణ్ నట విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే..ఇప్పటికే సుకుమార్, చిరంజీవి చెప్పిన రివ్యూ కి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి.. ఈ సంక్రాతికి చరణ్ కచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.