MOVIE REVIEWS Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/category/movie-reviews/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 25 Oct 2024 07:12:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg MOVIE REVIEWS Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/category/movie-reviews/ 32 32 పొట్టేల్ సినిమా రివ్యూ https://filmybowl.com/telugu/pottel-movie-full-review/ https://filmybowl.com/telugu/pottel-movie-full-review/#respond Fri, 25 Oct 2024 07:12:29 +0000 https://filmybowl.com/telugu/?p=843 Pottel Movie Full Review :  నటీనటులు: యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకుడు: సాహిత్ మోత్కూరి నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి – సురేష్ కుమార్ సాదిగ సంగీతం: శేఖర్ చంద్ర కెమెరా: మోనిష్ భూపతిరాజు Release Date : అక్టోబర్ 25, 2024 ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ హిట్స్ చిన్న సినిమాలకే చూస్తుంది. గత మూడు, నాలుగు...

The post పొట్టేల్ సినిమా రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Pottel Movie Full Review
Pottel Movie Full Review

Pottel Movie Full Review : 

నటీనటులు: యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్
దర్శకుడు: సాహిత్ మోత్కూరి
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి – సురేష్ కుమార్ సాదిగ
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా: మోనిష్ భూపతిరాజు
Release Date : అక్టోబర్ 25, 2024

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ హిట్స్ చిన్న సినిమాలకే చూస్తుంది. గత మూడు, నాలుగు నెలలు గా చిన్న సినిమాలన్నీ దాదాపుగా లాభాలని తెచ్చి పెడుతున్నాయి అదే ఇంకో చిన్న సినిమా రిలీజ్ కి రెడీ అయింది.

చిన్న సినిమాలు వచ్చి హిట్ కొట్టడం చాలనే చూశాం కానీ ఈ మధ్య కాలం లో ఓ చిన్న సినిమాకి విపరీతమైన బజ్ రావడం బహుశా “పొట్టేల్” సినిమా కి మాత్రమే దక్కిన అదృష్టమే అని చెప్పాలి.

సినిమా కి ఎంచుకున్న ప్రమోషనల్ కంటెంట్ కానీ, ప్రెస్ మీట్ లో అడిగిన ఒక కాంట్రెవర్సియల్ హడావుడి వల్ల కానీ సినిమా అందరికీ ఈజీ గా రీచ్ అయ్యింది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల అవుతుండగా.. సినిమా మీద ఎంతో నమ్మకం తొ రెండ్రోజుల ముందే మీడియా కోసం ప్రీమియర్స్ వేశారు దర్శకనిర్మాతలు. మరి “పొట్టేల్” చిత్రం ఆ నమ్మకాన్ని ఎంత మేరకు నిలబెట్టుకుందో తెలుసుకుందామా…. ఐతే రివ్యూ చదవండి

కథ: ఇది రాష్ట్ర విభజన ముందు కథ. ఇప్పటి తెలంగాణ రాష్ట్రం లో, నాస్తి ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయక ముందు తెలంగాణ ప్రాంతంలోని గుర్రంగట్టు అనే ఓ కుగ్రామం లో జరిగిన కథ ఈ “పొట్టేల్”.

బాలమ్మ పొట్టేల్ కు కాపరుడైన గంగాధర్ (యువ చంద్ర) ఊరికి పెద్ద అయిన పటేల్ (అజయ్) ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకొని వీరిని రక్షించుకోవాలని చూస్తుంటాడు. అయితే.. ఊరంతా పటేల్ వ్యవస్థను గుడ్డిగా నమ్మి గంగ ఎంతగా మొత్తుకుంటున్నా ఆ మాటలని ఎవరు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుంటారు.

పటేల్ వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో తెలియచేస్తూ దాని నుండి బయటకు రమ్మని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపునిచ్చిన తర్వాత కూడా పటేల్ గుర్రంగట్టు ప్రజలందరి పై మూఢ నమ్మకం ముసుగులో అందరినీ భయపెడుతూ అధికారం చలాయిస్తూనే ఉంటాడు.

తాను చదువుకోలేకపోయాడు కాబట్టే తన మాట, తాను నిజం చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని.. కనీసం తన బిడ్డ సరస్వతినైనా చదివించాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు గంగ.

ఆ సంకల్పం తో ముందుకెళ్తున్న గంగ కి ఆ ఊరి లో, ఆ ఊరి పెద్ద వల్ల ఎదురైన సమస్యలు ఏమిటి? గంగ ఆశలను పటేల్ ఎలా తొక్కిపెట్టాడు? గుర్రంగట్టు ప్రజలు పటేల్ ఆడుతున్న ఆటను ఎప్పటికీ అర్థం చేసుకున్నారు. ఆ దుర్మార్గుడి నుండి ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానo ఇస్తూ సాగిపోతుంది“పొట్టేల్” చిత్రం.

నటీనటుల పనితీరు: అజయ్ కి చాల పోటేంషియల్ ఉంది. నటుడిగా ఎన్నో మంచి పాత్రలు వేశాడు. కానీ ఇది అజయ్ మాత్రమే చేయాల్సిన పాత్ర అనేతువంటిది ఇప్పటి వరకు పడలేదు. ఆ లోటు నీ పొట్టెల్ తీర్చేసింది అనే చెప్పాలి. ఒక మంచి నటుడికి ఆసక్తికరమైన పాత్ర ఇస్తే ఏస్థాయిలో జీవిస్తాడు అనేందుకు పటేల్ పాత్రలో అజయ్ ఒదిగిపోయిన విధానం ఉదాహరణగా చెప్పచ్చు.

ఈ మాట అంటే ఆస్థ అతి గా వుండచ్చు గాని “లెజెండ్”లో జగపతిబాబు, “విక్రమ్”లో విజయ్ సేతుపతిల తర్వాత ఆ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దారు విలన్ క్యారెక్టర్నీ “పొట్టేల్” సినిమాలో.

పాత్ర పుట్టుక నుంచి ఆ పాత్ర ఎందుకు అలా వ్యవహరిస్తుంది, దానికి కారణం ఏమిటి? వంటి విషయాలు దర్శకుడు చాల నేర్పుతో, ఓర్పుతో రాసుకున్నాడు, ఆ రాత లో ఎంత కష్టపడ్డాడో , తీత లో కూడా దర్శకుడు తన ప్రతిభ నీ చించాడు.

అలాగే దర్శకుడి కష్టాన్ని అర్థం చేసుకొని అజయ్ పటేల్ పాత్ర నీ తెరపై పండించిన తీరు అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం అనే చెప్పుకోవాలి. అజయ్ లాంటి నటుడ్ని మన దర్శకులు సరిగా వినియోగించుకోకుండా పరభాషా నటులను అనవసరంగా పోషిస్తున్నారు అని సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అనిపించక మానదు.

ఇప్పటికే “మత్తు వదలరా 2, దేవర” సినిమాతో మంచి ఊపు లో ఉన్న అజయ్ కి “పొట్టేల్” ఎన్నాళ్ల నుండో రాకుండా ఉండిపోయిన గుర్తింపును తీసుకొస్తుందిప్.

ఇక హీరో పాత్రలో చేసిన యువ చంద్ర నటన చాల శ్రద్ధ గా చేశాడు. పాత్ర కోసం తనను తాను మార్చుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా కూతురు చదువు కోసం దేనికైనా తెగించే తండ్రిగా అతడి నటన చాలా సహజంగా ఉంది. అందరికీ చెరువవుతుంది అనడంలో సందేహం లేదు.

అనన్య మరోసారి చాల సహజమైన పాత్రలో మంచి నటనతో ఆకట్టుకుంది. ఆమె కట్టు బొట్టు, ఆ ముఖంలోని అమాయకత్వం బుజ్జమ్మ పాత్రకు ప్లస్ అయ్యాయి. అనన్య చెప్పినట్టు బహుశా తెలుగు ప్రేక్షకుడికి ఈమె బుజ్జమ్మ గానే గుర్తుండిపోతుంది అన్నట్టు ఈ పాత్ర తాను చేసింది.

టీచర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్, ఊరి మనిషి పాత్రలో నోయల్ చక్కని నటనతో ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యం గా చెప్పుకోవాల్సింది సరస్వతిగా నటించిన పాప తన్వి శ్రీ, పెద్ద పెద్ద కళ్లతో భయాన్ని, బాధని ఇంత చిన్న వయసులోనే తాను పండించిన తీరు అభినందనీయం.

సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమా మూడ్ నీ రిఫలెక్ట్ చేస్తూ సన్నివేశానికి ఎంత మేరకు కావాలో సరిగ్గా తూకం వేసి మరి ఇచ్చాడు. ఇక సినిమా లోని పాటలన్నీ ఎక్కేస్తాయి. నేపథ్య సంగీతమైతే.. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. సినిమా నీ ఒక ఎత్తులో నిలబెట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రీ-రికార్డింగ్ & వోకల్స్ తారా స్థాయిలో ఉన్నాయి. శేఖర్ చంద్ర కెరీర్ కి ఈ సినిమా ఓ పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.

Also Read : మెగా సీజన్ స్టార్ట్స్

కెమెరామెన్ మోనిష్ భూపతిరాజు వర్క్ కూడా ఈ సినిమాకి కీలకమే. ప్రీక్లైమాక్స్ లో ఒక సన్నివేశం లో తన సత్తా చాటాడు. అలాగే.. సినిమా లోని ప్రతి సన్నివేశంలో ఎమోషన్ కు తగ్గట్లుగా వినియోగించిన లైటింగ్ & ఫ్రేమింగ్ ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి.

ఈ సినిమా కి టెక్నికల్ టీం వర్క్ ప్రాణం పోసింది.. ఈ కథ 1950 నుండి1990 దశకం లో జరిగేదే అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి వేరే ఆలోచన రాకుండా తీశారు. ఏ మాత్రం ప్రేక్షకుడికి వేరే ఆలోచన రానీయకుండా వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు సూపర్ అనే చెప్పాలి.అదే విధంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ నీ మెచ్చుకోవాల్సిందే

నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా భారీగానే ఖర్చు చేశారు దానికి తగా ఫలితం కూడా అందుకోనున్నారు. దర్శకుడి విజన్ కు ఎంతలా సపోర్ట్ ఇచ్చారో ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఓ దర్శకుడికి రెండో చిత్రానికి ఇలాంటి నిర్మాతలు దొరకడం అంటే దర్శకుడు ఒక రకంగా అదృష్టం చేసుకున్నాడని చెప్పుకోవాలి.

దర్శకుడు సాహిత్ మోత్కూరి తొలి సినిమా “సవారి” (2020). ఆ సినిమా అంతగా అలరించకపోయినా ఆ అపజయం తాలూకు కసి “పొట్టేల్” సినిమా రైటింగ్ లో కనిపిస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్, పాత్రల తీరుతెన్నులు, క్యారెక్టర్ ఆర్క్స్ రాసుకున్న విధానం అబ్బురపరిచింది.

Read Also :  ఇట్స్ మీనాక్షి టైం

ముఖ్యంగా ఓ స్వార్థపరుడు దైవాన్ని, మూఢ నమ్మకాల్ని తనకు కావాల్సినట్లుగా వాడుకొని అమాయకులైన ప్రజలను ఎలా గొర్రెల మందలా మార్చి తన చుట్టూ తిప్పుకున్నాడు అనే అంశాన్ని రాసుకున్న విధానం ఆశ్చర్యపరుస్తుంది. మొత్తం మీద సాహిత్ కి దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు వేస్తారు ప్రేక్షకులు అని చెప్పాలి.

విశ్లేషణ: చదువు అనేది ఎంత ముఖ్యమో అది ఒక మనిషిని కాదు మొత్తం సమాజాన్ని, వ్యవస్థను తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని “పొట్టేల్” సినిమా ద్వారా మరో సారి తెలియజెప్పడం అనేది అభినందనీయం.

చివరగా పొట్టేల్: అందరికీ నచ్చే మాంచి సినిమా.

Filmy Bowl Movie Rating: 3/5

Follow us on Instagram 

The post పొట్టేల్ సినిమా రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pottel-movie-full-review/feed/ 0
‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ https://filmybowl.com/telugu/janaka-aithe-ganaka-film-full-review/ https://filmybowl.com/telugu/janaka-aithe-ganaka-film-full-review/#respond Fri, 11 Oct 2024 14:36:41 +0000 https://filmybowl.com/telugu/?p=698 Janaka Aithe Ganaka Review : మహాభారతంలో ప్రతి పాత్రకి ఒక ఎమోషన్ ఉంది, ప్రతి పాత్ర చుట్టూ ఒక కధ తాయారు చేసుకోవచ్చు అన్నట్టు…. మధ్య తరగతి జీవితాల్లో కూడా బోలెడు ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి రోజు జరిగే వాటి మీద ఎన్ని కథలైనా రాయచ్చు. అందుకే ఫ్యామిలీ సినిమా తియ్యాలి అనుకోగానే రచయితల రాత మధ్య తరగతి జీవితాల వైపే వెళ్తుంది. సుహాస్ హీరోగా దిల్ రాజు...

The post ‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Janaka aithe ganaka film full review
Janaka aithe ganaka film full review

Janaka Aithe Ganaka Review : మహాభారతంలో ప్రతి పాత్రకి ఒక ఎమోషన్ ఉంది, ప్రతి పాత్ర చుట్టూ ఒక కధ తాయారు చేసుకోవచ్చు అన్నట్టు…. మధ్య తరగతి జీవితాల్లో కూడా బోలెడు ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి రోజు జరిగే వాటి మీద ఎన్ని కథలైనా రాయచ్చు. అందుకే ఫ్యామిలీ సినిమా తియ్యాలి అనుకోగానే రచయితల రాత మధ్య తరగతి జీవితాల వైపే వెళ్తుంది.

సుహాస్ హీరోగా దిల్ రాజు సమర్పణలో వచ్చిన ‘జనక అయితే గనక’ కూడా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ మిక్స్ అయినా స్టోరీ నే.

నేటితరం జంటలు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ పెళ్లి తర్వాత పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్న మిడిల్ క్లాస్ జంట జీవితాన్ని ఈ కథ లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి బండ్ల. మరీ ఆ ప్రయత్నం ప్రేక్షకుల్ని అలరించిందా లేదా. ఎమోషన్స్ ఎంత వరకు కూర్చోబెట్టాయి తెలుసుకుందాం పదండి.

ప్రసాద్(సుహాస్) ఒక మిడిల్ క్లాస్ మనిషి. పిల్లల్ని కని వాళ్ళని ఎలా పెంచాలి అనే దాని మీద చాలా క్లారిటీ తో ఉంటాడు. పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి లేదంటే పిల్లలే వద్దు అనుకునే తత్వం. అతనికి వచ్చే 30వేల జీతానికి పిల్లల్ని బాగా చూసుకోలేడు కాబట్టి పెళ్లయి రెండేళ్ళు దాటుతున్న పిల్లల జోలికి వెళ్ళడు.

ఇక ప్రసాద్ భార్య(సంగీత విపిన్) భర్త మనసుని అర్ధం చేసుకొని అందుకు తగ్గట్టే జీవితాన్ని సాగిస్తుంటది. ఇంట్లో మాత్రం ప్రసాద్ తండ్రి పిల్లలు ఎప్పుడని గోల చేస్తుంటారు.

ఈ రోజుల్లో ఒక పిల్లోడిని పెంచాలంటే కోటి రూపాయిలు కావాలని ఇంట్లో వాళ్ళకి పేపర్ మీద లెక్కలు వేసి చూయిస్తాడు ప్రసాద్. దీంతో చేసేదేం లేక తండ్రి (గోపరాజు రమణ) కూడా సైలెంట్ అయిపోతాడు.

ఐతే అనుకోకుండా ప్రసాద్ భార్య గర్భవతి అవుతుంది. దీంతో తాను వాడిన కండోమ్ సరిగ్గా పని చేయలేదని ఆ కంపెనీ పై లీగల్ గా వెళ్తాడు ప్రసాద్. తర్వాత ఏం జరిగింది? ఈ కేసులో ఎలాంటి వాదనలు జరిగాయి? కోటి నష్టపరిహారం చెల్లించాలని అడిగిన ప్రసాద్ ఈ కేసు గెలిచాడా లేదా? అనేది మిగతా సినిమా.

కొన్ని ఐడియాలు పేపర్ మీద చాలా బావుంటాయి. ఐడియా వినగానే ఎక్సైట్ అయిపోతారు ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు’ అనే ఫీలింగ్ తో స్క్రిప్ట్ ఓకే చేస్తారు అయితే ఆ ఐడియాని సినిమాగా మార్చ గలిగే సత్తా దెగ్గరే దర్శకుడి అసలు పనితనం బయటికొస్తుంది.

ఐడియా తో సినిమా మీద క్రేజ్ తీసుకు రావచ్చు అధి ట్రైలర్ వరకు చాలా బావుంటది. మరి సినిమా ని నిలబెట్టాలంటే ఐడియా కి మంచి సీన్స్ పడాలి.
కండోమ్ కంపెనీ మీద కేసు పెట్టడం ఐడియా బావుంది. అయితే ఆ ఐడియాని స్క్రీన్ ప్లేగా మార్చే విషయం లో సినిమాగా చూపించడంలోనే కొంత ఇబ్బంది ఎదురైయింది.

ట్రైలర్ లోనే కాన్సెప్ట్ ని చెప్పేసినప్పుడు సినిమాలో ఆ పాయింట్ ని తెర మీద కి స్పీడ్ గా తేవాలి అలాంటిది ఆ పాయింట్ ఇంటర్వెల్ ముందు మాత్రమే సినిమాలో చూయించాడు దర్శకుడు.

కాకపోతే ఈ మెయిన్ పాయింట్ కి లీడ్ అయ్యే సన్నివేశాలని పేర్చుకుంటూ దర్శకుడు టైం పాస్ చేసాడు. భార్య భర్తల మధ్య ఎమోషన్ ని చూపిడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. పోనీ ఆ తర్వాత అయినా పాయింట్ లోకి వెళ్లాడా అంటే వెళ్ళలేదు. ఇప్పటి తరంలో పిల్లల్ని కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పే సీక్వెన్స్ మాత్రం చాలా బాగా చూపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ హిలేరియస్ గా వచ్చింది.

మొదటి సగం తో పోల్చుకుంటే రెండో సగం చాలా బెటర్ గా సాగుతుంది. మురళీశర్మ ఎంట్రీ తో క‌థ‌లో డ్రామా సూపర్ గా పండింది. కానీ ఆ మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు పెలవం గా ఉన్నాయి. కోటి కాదు ఐదు లక్షలు ఇష్టము అనడం తో నే కండోమ్ కంపెనీ వోడిపోతుంది అన్నట్టుంటది. ఆ లాజిక్ ని దర్శకుడిని సరిగ్గా రాసుకోవాలి

హీరో గా సుహాస్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త కాదు. మిడిల్ క్లాస్ పాత్రలు ఈ మధ్య చాల ఎక్కువ వస్తుంది. అలా వచ్చిన పాత్రల్లో ఒక్కటి గా వుండేదే తప్పవ్ప్రత్యేకం గా చెప్పడానికి ఏమి లేదు.

హీరోయిన్ గా సంగీత విపిన్ హుందాగా నటించింది. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్ కొన్ని నవ్వులు పంచాడు. అప్ప‌టి వ‌ర‌కూ అస‌మ‌ర్థ లాయ‌ర్ గా చూపించిన ఆ పాత్ర‌ని.. చివ‌ర్లో ఎగ్ర‌సీవ్ చేయ‌డం బాగుంది.

Read Also : అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఆ రోజే నా ?

మురళిశర్మ సెకెండ్ హాఫ్ లో డ్రామాని, సినిమా ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ న్యాయమూర్తి పాత్రలో బాగానే ఉన్నారు

టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపధ్యం సంగీతం మాత్రం పర్వాలేదనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో కావాల్సిన దాని కంటే లౌడ్ గా చేశాడు. సాయి శ్రీరామ్ కెమెరాపనితనం బావుంది అనిపిస్తుంది.

ఇల్లు, కోర్టు చుట్టూ నడిచిపోయే సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా వున్నాయి. పదునైన మాటలైతే లేవు. ద‌ర్శ‌కుడు ఐడియా బావుంది. కానీ ఐడియాలో ని సినిమాగా మార్చడంలో ఇంకా కాస్త శ్రద్ధ పెట్టాల్సింది.

ఐడియాలోని కోర్ ఎమోషన్ ని బలంగా చూపించి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ గా వుండేది. ఇప్పటికి అయితే ఇప్ప‌టికీ సినిమాకి ఢోకా లేదు. ఎక్క‌డ లైన్ దాటినా ఫామిలీస్ ఔట్ రైట్ రిజెక్ట్ చేసే అవకాశం ఉండడం తో దర్శకుడు పరిది దాటలేదు. దాన్ని వీలైనంత డీసెంట్ గా ట్రీట్ చేశారు.

కామెడీ, వెన్నెల కిషోర్ టైమింగ్.. ఈ సినిమాని నిలబెట్టేసాయి. చివర్లో బామ్మ ఇచ్చే ట్విస్ట్ అయితే ఇంకా సూపర్ గా చెప్పింది. అది ఇక్కడ చెప్పడం కుదరదు సినిమా లోనే చూసి తెలుసుకోండి

Filmy Bowl Rating: 2.75/5

Follow us on Instagram

The post ‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/janaka-aithe-ganaka-film-full-review/feed/ 0
‘వేట్టయాన్’ మూవీ రివ్యూ https://filmybowl.com/telugu/rajinikanth-vetteyian-movie-full-review/ https://filmybowl.com/telugu/rajinikanth-vetteyian-movie-full-review/#respond Thu, 10 Oct 2024 16:09:07 +0000 https://filmybowl.com/telugu/?p=692 Rajinikanth Vetteyian Movie Full review : టీజీ జ్ఞానవేల్ … తమిళ ఇండస్ట్రీ లో ‘జై భీమ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. ఆయన దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రానా దగ్గుబాటి ఫహద్ ముఖ్య పాత్రల్లో రూపొందించిన చిత్రం వేట్టయాన్…. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి. తారాగణం:...

The post ‘వేట్టయాన్’ మూవీ రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Rajinikanth Vetteyian Movie Full review
Rajinikanth Vetteyian Movie Full review

Rajinikanth Vetteyian Movie Full review : టీజీ జ్ఞానవేల్ … తమిళ ఇండస్ట్రీ లో ‘జై భీమ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. ఆయన దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రానా దగ్గుబాటి ఫహద్ ముఖ్య పాత్రల్లో రూపొందించిన చిత్రం వేట్టయాన్….

ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి.

తారాగణం: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ,రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, రావు రమేష్, కిషోర్, అభిరామి తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్
కెమెరా: ఎస్.ఆర్.కదిర్
నిర్మాత: సుభాస్కరన్
రచన- టీజీ జ్ఞానవేల్-కృత్తిక
దర్శకత్వం: టీజీ జ్ఞానవేల్

గత ఏడాది నెల్సన్ దర్శకత్వం లో ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత ఆయన కూతురు దర్శకత్వం లో ప్రత్యేక పాత్రలో నటించిన ‘లాల్ సలాం’ నిరాశపరిచింది. తదుపరి చిత్రం గా చేసిన మూవీ ‘వేట్టయాన్’.

కథ:
తమిళనాడులోని కన్యాకుమారిలో ఎస్పీగా పని చేస్తుంటాడు అథియన్ (రజినీకాంత్), ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దేశంలోనే గొప్ప పేరుంటుంది అథియన్ కు. సమాజానికి హానికరమైన నేరస్థులను తనదైన శైలిలో ఏరి పారేస్తుంటాడు. చట్టం కంటే తనని తాను నమ్మే అథియన్ కు తాను చేసే ఎన్ కౌంటర్ల విషయంలో పశ్చాత్తాపం ఏమీ ఉండదు.

అథియన్ చేసిన ఒక స్మగ్లర్ ఎన్ కౌంటర్ కు శరణ్య అనే
ఉపాధ్యాయురాలు సహకరిస్తుంది. తర్వాత కొన్ని రోజులకే ఆ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది గుణ అనే వ్యక్తి అని తెలుసుకొని తగిన ఆధారాలను సేకరించి అతణ్ని ఎన్ కౌంటర్ చేస్తాడు అథియన్.

కానీ ఈ ఎన్ కౌంటర్ ని విచారించిన జడ్జి సత్యదేవ్ (అమితాబ్) ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటికి తీసి అథియన్ ముందు పెడతాడు. వాటిని తెలుసుకున్నాక తొలిసారి పశ్చాత్తాప పడే పరిస్థితి వస్తుంది..

ఇంతకీ సత్యదేవ్ వెలుగులోకి తెచ్చిన విషయాలేంటి.. దాని వల్ల అథియన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. చివరికి ఈ కేసు సంగతి ఏమైంది.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

Read Also : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

కథనం-విశ్లేషణ:

కథ మీద నడిచే సినిమాలు కొన్ని ఉంటాయి
స్టార్లు మాత్రమే నడిపించగల కథలు కొన్ని ఉంటాయి.
స్టార్లు మాత్రమే చేయాల్సిన కథలూ కొన్ని ఉంటాయి.
ఇవన్నీ కాకుండా స్టార్లు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి మామూలు కథల్లోనూ నటిస్తే వాటి రీచ్ ఎంత గా పెరుగుతుందో గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం l.

టీజీ జ్ఞానవేల్…. సూర్య లాంటి స్టార్ హీరో తో తన ఇమేజ్ ని పక్కన పెట్టించి మరి ‘జై భీమ్’ అనే ఓ గొప్ప కథలో నటింప చేసాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రీచ్ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే .

ఆ ప్రయోగం బ్లాక్ బస్టర్ అవ్వడం తో తర్వాత సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తోను అదే సామాజిక అంశాలతో ముడిపడ్డ ఓ మంచి కథనే చెప్పడానికి ప్రయత్నించాడు జ్ఞానవేల్.

ఐతే రజినీ ఇమేజ్ వేరు…
సూర్య ఇమేజ్ వేరు….
ఎంత వద్దనుకున్నా బయటికి రాలేని ఇమేజ్ ఛట్రం రజినీది. అందుకే కమర్షియల్ హంగులు జోడించక తప్పలేదు.

అలా కొంచెం పక్కకి వెళ్లి జోడించిన కమర్షియల్ హంగులు సినిమాలో సింక్ అవ్వలేదని అనుకోలేము. అలా అని అవి అదిరే లాగ ఉన్నాయి అని చెప్పలేం.

ఇక కథ గురించి మాట్లాడుకుంటే దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిదే. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే థ్రిల్లర్ సినిమాలా ఆసక్తికరంగా నడిచే ‘వేట్టయాన్’ ఆపై సామాజిక అంశాల వైపు నడిపించాడు.. మరల కాసేపాగాక సాగదీసి క్లాస్ లు చెప్పడం తో.. చివరికి మామూలు సినిమాలా ముగుస్తుంది.

ఓ పోలీస్ అధికారి తాను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఎన్ కౌంటర్లు చేస్తాడు. అవన్నీ పేరు కోసం చేసినవి కాదు. వాటి విషయంలో గర్వపడడు, పశ్చాత్తాపం పడడు

ప్రతి ఎన్ కౌంటర్ విషయంలో తనకి తాను సమాధానం చెప్పుకున్నాకే నేరస్థుల పని పడతాడు. అలాంటి అధికారి ఒక నిర్దోషి ని అన్యాయంగా చంపేస్తే? ఇదే ‘వేట్టయాన్’ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ‘వేట్టయాన్’ ప్రేక్షకులకు మంచి ఊపునిస్తుంది. అక్కడి వరకు సినిమా చాలా రేసీ గా నడుస్తుంది. ఆ తర్వాత ఆ వేగం లేకపోవడమే ‘వేట్టయాన్’ సమస్య.

మొదటి సగం వరకు ‘వేట్టయాన్’ మంచి రేసీ గా నడుస్తుంది. కథ ఎలా ఉన్నా రజినీ సినిమా అంటే విపరీతమైన బిల్డప్పులు.. ఎలివేషన్లు షాట్లు మామూలే. ఈ కథలో అవి అంతగా అతకక పోయినా.. కథ ని చెడగొట్టకుండా అభిమానులని నిరాశ పరచకుండా అక్కడక్కడా ఎలివేషన్లు ఇస్తూ.. బలంగానే కథను చెప్పాడు జ్ఞానవేల్.

ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా హీరో పాత్ర పరిచయానికి, ఎలేవేషన్స్ కి ఒక ఎపిసోడ్ ని డిజైన్ చేసి.. ఆ తర్వాత వెంటనే కథలోకి వెళ్లిపోయాడు. శరణ్య పాత్రతో సినిమా ని ఒక ఇంటెన్స్ మోడ్ వైపు నడిపించాడు. ఏ అమ్మాయి సాయంతో అయితే హీరో ఓ స్మగ్లర్ ను ఎన్ కౌంటర్ చేసాడో.. కానీ చివరికి ఆ అమ్మాయే చనిపోవడం.. దాన్ని పోలీసులు ఛేదించి హంతకుడిని చంపడం.. ఆ ఎన్కౌంటర్ లో తప్పులు జరగడం.. ఇలా ‘వేట్టయాన్’ చాలా చక్కగా ప్రేక్షకులని రంజింప చేస్తుంది. ఇంటర్వెల్ సమయానికి కథ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటది.

ఐతే ద్వితీయార్ధంలో ట్విస్ట్స్ అన్ని వీడే వరకు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేసే ‘వేట్టయాన్’ ఆ తర్వాత సాధారణంగా మారిపోతుంది. అసలు విలన్ ఎవరో తెలిసిన దగ్గర్నుంచి కథను అతి సాధారణంగా తీసుకెళ్లాడు దర్శకుడు.

అప్పటిదాకా థ్రిల్లర్ స్టయిల్లో నడిచిన ‘వేట్టయాన్’ ఆ తర్వాత ఓ సామాజిక సమస్య చుట్టూ అక్కడే తిరుగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు తీసుకున్న సమస్య ముఖ్యమైందే అయినా.. ఈ ఫార్మాట్లో చాలా కథలు వచ్చేసి ఉండడం వళ్ళ ప్రేక్షకుడు డిస్కోనెక్ట అయిపోతాడు.

ఈ కథ రజినీ రేంజ్ కి చిన్నదిగా అనిపిస్తుంది. అమితాబ్ కూడా ఒక దశ దాటాక పెద్దగా చేసింది ఎం లేదు. మిగతా నటుల ప్రాధాన్యమూ తగ్గిపోయింది. సినిమా మొదలు పెట్టినప్పుడు నడిచిన తీరుకు.. చివరికి ముగిసిన తీరుకు పొంతన ఉండదు. జ్ఞానవేల్ కథలోని ఎమోషన్ ప్రేక్షకులను బలంగా తాకుతుంది. కానీ ‘వేట్టయాన్’ మాత్రం ఆ ఫీలింగ్ ఇవ్వదు.

దర్శకుడి చాలా మంచి ప్రయత్నం చేసాడు ఈసారి కూడా మంచి కథనే చెప్పాడు. సూపర్ స్టార్ ని కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ప్రథమార్ధంలో చాలా విజిల్ మూమెంట్స్ ఇచ్చాడు. కానీ మొత్తం గా ఒక పకడ్బందీ సినిమాను ఇవ్వలేకపోయాడు. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని.. ‘జస్ట్ ఓకే’ అనిపించే సినిమా ఇది.

Read Also : Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

నటీనటులు:

సూపర్ స్టార్ ఇందులో ఎంతో కొత్తగా కనిపిస్తారు. ఆయన స్టయిల్లో ఎలివేషన్లు లేవు కానీ అభిమానులను అలరించే సీన్లు పడ్డాయి. చాలా వరకు కథతో పాటే రజిని ప్రయాణించారు.

రజిని కి ఉన్న స్టార్ పవర్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా అలరిస్తుంది. ఇందులో కొన్ని మామూలు సీన్లలో కూడా సూపర్ స్టార్ ఆకర్షణీయంగా మార్చారు. అమితాబ్ జడ్జి పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు.

సినిమాలో కీలక పాత్ర చేసిన దుషారా విజయన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఫాహద్ ఫాజిల్.. ఈ సినిమాలో వినోదం పంచే పాత్రలో నటించి పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. రజినీ ముందు
నెగెటివ్ పాత్రలో రానా దగ్గుబాటి ఆకట్టుకున్నాడు
రజిని కి దీటుగా నిలబడ్డాడు. రజినీ భార్య పాత్రలో మంజు వారియర్ మెప్పించింది.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ రవిచందర్ సంగీతం ఇంకా బావుండాలి అనిపిస్తుంటది. బ్లాక్ బస్టర్ హిట్ ఐన మనసిలాయే పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్, రజినీ ఎలివేషన్ సీన్లలో అనిరుధ్ ఎప్పట్లాగే డ్యూటీ చేశాడు. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్ గా సినిమా చాలా బాగుంది.

లైకా నిర్మాణ విలువలూ బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ ప్రయత్నం మాత్రం మెచ్చదగిందే. రజినీని ఈ కథలోకి తీసుకురావడం తోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ఆయన్ని కొత్తగా ప్రెజెంట్ చేసి కథకు రీచ్ ఇవ్వగలిగాడు.

చివరగా: వేట్టయాన్.. వేట ని మధ్యలో ఆపేసాడు….

Rajinikanth Vetteyian Movie review రేటింగ్ – 2.75/5

Follow us on Instagram

The post ‘వేట్టయాన్’ మూవీ రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajinikanth-vetteyian-movie-full-review/feed/ 0
శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ? https://filmybowl.com/telugu/sree-vishnu-swag-movie-full-review/ https://filmybowl.com/telugu/sree-vishnu-swag-movie-full-review/#respond Fri, 04 Oct 2024 16:12:39 +0000 https://filmybowl.com/telugu/?p=619 Swag Movie Review : మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం తారాగణం: శ్రీ విష్ణు, రీతూ వర్మ, దక్షా నాగర్కర్ , మీరా జాస్మిన్, శరణ్య, సునీల్, రవిబాబు, గెట్ అప్ శ్రీను తదితరులు ప్రొడక్షన్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్: టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల రైటర్ & డైరేక్షన్: హసిత్ గోలీ మ్యూజిక్: వివేక్ సాగర్ రిలీజ్ డేట్: 4 , అక్టోబర్,...

The post శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Sree Vishnu Swag Movie Full Review
Sree Vishnu Swag Movie Full Review

Swag Movie Review : మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం
తారాగణం: శ్రీ విష్ణు, రీతూ వర్మ, దక్షా నాగర్కర్ , మీరా జాస్మిన్, శరణ్య, సునీల్, రవిబాబు, గెట్ అప్ శ్రీను తదితరులు
ప్రొడక్షన్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
ప్రొడ్యూసర్స్: టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల

రైటర్ & డైరేక్షన్: హసిత్ గోలీ
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: 4 , అక్టోబర్, 2024
శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలీ దర్శకత్వంలో స్వాగ్ చిత్రం రూపుదిద్దుకుంది. రాజ రాజ చోర లాంటి హిట్ తర్వాత హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ఇది. ఈచిత్రంలో శ్రీవిష్ణు నాలుగు పాత్రలు పోషించాడని ట్రైలర్‌లో చూపించారు. పైగా రాజుల కాలం సినిమా అనడం తో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి చిత్ర బృందం ఆ అంచనాలని అందుకుంది లేదా తెలుసుకుందాము.
కథ:
1551 సంవత్సరం లో జరిగే కాలం నుండి సినిమా మొదలెట్టాడు దర్శకుడు. మాతృస్వామ్య ఒక కుటుంబంలో అనగదొక్కబడి వున్న స్వగానిక వంశానికి చెందిన మహారాజు గా శ్రీవిష్ణు కనిపిస్తారు. ఏ రోజుకైనా పురుషుడి అధిపత్యం రావాలని తపిస్తుంటాడు. ఎప్పటికైనా తన వారసత్వం నిలబడాలని కలలు కంటుంటాడు. అనుకున్నటే తనకి కొడుకు పుట్టడం తో తన హయం నుండి పితృస్వామ్య పాలన మొదలుపెడతాడు .
మాయాతి, భవభూతి, సింగరేణి (సింగ) వీళ్లందరు ఆ కుటుంబానికి సంబంధించిన మిగత తరాల వ్యక్తులు. మాయాతి, భవభూతి ఇద్దరు పురుషాధిక్యం చూపిస్తుండడం తో ఆ కుటుంబంలో గొడవలు మొదలై సంబంధాలు తేగిపోతాయి.
ఇక ఈ వంశానికి సంబందించిన సొమ్ములు దక్కాలంటే నేటితరం లోని వారసుడిని కనిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకోసం అందరు వెతుకులాట మొదలెడతారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అయిందా? రాజుల సొమ్ములు ఎవరికి సొంతం అయ్యాయి ? కథ మధ్యలో వచ్చే విభూతి ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా వుంది:
కథ నీ దర్శకుడు ఎంత గొప్పగా అయినా రాసుకొని కానీ దాన్ని రిక్లైనర్ సీట్ లో కూర్చోని సినిమా చూసే ప్రేక్షకుడికే కాదు…. నేల మీద కూర్చోని సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా అర్ధం అవ్వాలి. అలా అర్ధం అవ్వకపోతే ఆ కథ ఎంత గొప్పదైన పెద్దగా ఉపయోగం ఉండదు . ఒక మామూలు కథ ని తీసుకొని అర్ధవంతంగా నువ్వు ప్రేక్షకుడికి చెప్తే దర్శకుడు పాస్ అయిపోయినట్టే.

ఈ కథ లో దరకుడు చాలా మంచి పాయింట్ చెప్పాలనుకున్నాడు. మనసుని మెలిపెట్టే ఎమోషన్ ఉంది ఐనా ఎం ఉపయోగం. కథ చెప్పిన విధానం మొత్తం గందరగోళమే. ఏ పాత్ర ఎక్కడ మొదలైంది, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఎవరికీ అర్ధం అవ్వదు అంటే తప్పు కాదు. కామెడీ సినిమాలని ఎంతో ఈజ్ తో చేసే శ్రీవిష్ణు ఈ సినిమా లో రాకరకాల గెట్ అప్స్ వేసాడు. విచిత్రమైన స్లాంగ్ లో మాట్లాడాడు, కామెడీ చేసాడు కానీ ఏది ప్రేక్షకుడికి రిజిస్టర్ అవ్వలేదు అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎలా వెళ్లిందో.
మొదటి సగం అంతా రాజ్యం, వంశం, రాజులు, పితృస్వామ్యం, మాతృస్వామ్యం ఇదే దృశ్యాలు. హీరో & హీరోయిన్ వంశాలే నిండుగా వుంటారు అలాంటిది రాజ్య ఖజానాని పరిరక్షించే వాళ్ళ వంశం వివరాలు చెబుతుంటే అది ఇంకా తికమక వ్యవహారం అనే చెప్పాలి.

ఇక రెండో భాగం సాగుతున్నప్పుడు ప్రేక్షకుడు కాస్త సినిమాలో లీనమౌతాడు. ఎందుకంటె మొదటి సగం తో సంబంధం లేకుండా ఒక కొత్త పాత్ర ని తీసుకురావడం. ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కథ , పాత్రలు చాలా బావుంటాయి. ట్రాన్స్ జెండర్ చుట్టు అల్లిన సన్నివేశాలు సినిమా కి హైలైట్ అనే చెప్పాలి , వాటిల్లో పండిన ఎమోషన్ సినిమాకి పెద్ద బలం.

ఈ ఆలోచనలతో కాంచన సినిమా వచ్చింది. ఆ సినిమా లో చూసిన దాని కంటే ఈ సినిమా లో దర్శకుడు లింగ సమానత్వం గురించి చాలా బాగా చెప్పాడు. మొదటి సగాన్ని కూడా రెండో సగం లాగ దర్శకుడు చెప్తుంటే శ్రీవిష్ణుకి మరో మంచి సినిమా అయ్యేది.

Read Also : మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

నటినటులు పనితీరు:
శ్రీవిష్ణు నటన గురించి చెప్పేదేముంటది. ఈ తరంలో ఇండస్ట్రీకి దొరికిన అద్భుత నటుడు. ఈ సినిమా లో వివిధ గెటప్స్ లో కనిపించి ప్రతి పాత్రకి వైవిద్యం చూపించాడు. బవభూతి డైలాగ్ యాస ఒక దగ్గరికి వచ్చేసరికి ప్రేక్షకుడికి చిరాకు పుట్టించిద్ది. స్వాగనికి రాజు, సింగ పత్రాలు శ్రీ విష్ణుకి కొట్టిన పిండే. ఈ సినిమా కోసం శ్రీవిష్ణు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
హీరోయిన్ రీతూ వర్మ కూడా మల్టిపుల్ రోల్స్ లో కనిపించింది కానీ కథలో ఉన్న గందరగోళం వల్లనేమో పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా లో కనిపించిన మీరా జాస్మిన్ పాత్ర తన నటన ఆకట్టుకుంటుంది. ఇక సినిమా లో చేసిన మిగతా పాత్రలు దక్షా నాగర్కర్ జాస్మిన్, , శరణ్య, సునీల్, రవిబాబు, గెట్ అప్ శ్రీను తధితరులు వాళ్ళ పాత్రల మెరకు నటించారు.

టెక్నికల్ టీమ్ లో సినిమాటోగ్రఫీ, సంగీతం చక్కగా ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకి కావాల్సిన మేరకు ఖర్చు పెట్టరు నిర్మాతలు. దర్శకుడు హాసిత్ గోలీ చక్కటి కథ , మాటలు, నేపధ్యం రాసుకున్నా స్క్రీన్ ప్లే విషయం లో ప్రేక్షకుడిని గందరగోళం లో పడేసాడు.

చివరిగా
స్వాగ్: ప్రేక్షకుడిని తన స్వాగ్ తో గందరగోళానికి గురి చేసాడు దర్శకుడు….
Filmy Bowl Rating : 2.5/5

Follow us on Instagram

The post శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sree-vishnu-swag-movie-full-review/feed/ 0
దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/ntr-devara-part-1-movie-full-review/ https://filmybowl.com/telugu/ntr-devara-part-1-movie-full-review/#respond Fri, 27 Sep 2024 18:16:18 +0000 https://filmybowl.com/telugu/?p=426 NTR Devara Part 1 Movie Full Review తారాగణం: ఎన్టీఆర్ జూనియర్ , జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ , అజయ్, శ్రీకాంత్, శ్రుతి మరాఠె, గెటప్ శీను, సుదేవ్ నాయర్, నరేన్ ప్రొడక్షన్: ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్: కొసరాజు హరికృష్ణ , మిక్కిలినేని సుధాకర్ రైటర్ & డైరేక్షన్: కొరటాల శివ మ్యూజిక్: అనిరుద్ రిలీజ్ డేట్:...

The post దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Part 1 Movie Full Review
NTR Devara Part 1 Movie Full Review

NTR Devara Part 1 Movie Full Review

తారాగణం: ఎన్టీఆర్ జూనియర్ , జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ , అజయ్, శ్రీకాంత్, శ్రుతి మరాఠె, గెటప్ శీను, సుదేవ్ నాయర్, నరేన్
ప్రొడక్షన్: ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్
ప్రొడ్యూసర్స్: కొసరాజు హరికృష్ణ , మిక్కిలినేని సుధాకర్
రైటర్ & డైరేక్షన్: కొరటాల శివ
మ్యూజిక్: అనిరుద్
రిలీజ్ డేట్: 27 , సెప్టెంబర్, 2024

దాదాపు 6 ఏళ్ళ తర్వాత సోలో హీరో గా వస్తున్న ఎన్టీఆర్ , ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా కావడం , ఎన్టీఆర్ కి రాజమౌళి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం రిసల్ట్ మీద అందరికి ఆసక్తి ఏర్పడింది. మరి ఆ అంచనాలని ఈ చిత్రం అందుకుందో లేదో చూద్దాం పదండి

కథ:
ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు ప్రాంతం లో సముద్రం వడ్డున ఉండే నాలుగు ఊర్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు అక్కడి జనం. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనదేశ సంపదనని కాపాడి అవి జనానికి పంచుతూ ఇక్కడి వాళ్ళు మంచి పేరు సంపాదించుకున్నారు. కాల క్రమేణా అక్కడి ప్రజలు వాళ్ళకి బాగా తెలిసిన విద్యని అక్రమంగా రవాణా అయ్యే సరుకు ని పట్టుకొచ్చి పెద్దలకి ఇవ్వడం సొమ్ము చేసుకోడంని పని గా పెట్టుకొని జీవనం కొనసాగిస్తుంటారు. ఐతే తాము చేస్తున్నది తప్పని గ్రహించిన ఎర్ర సముద్రం నాయకుడు దేవర (ఎన్టీఆర్) ఇకపై ఈ పని ఆపేయాలని ఎర్రసముద్రంలో అందరికి హుకుం జారీ చేస్తాడు. కానీ ఆ బృందంలోనే ఉన్న మరో ఊరి పెద్ద భైరా (సైఫ్ అలీఖాన్)తో పాటు మరి కొందరికి దేవర ఆలోచన నచ్చదు. దేవర మాట కాదని సముద్రం ఎక్కాలనుకున్న అందరికి దేవర భయాన్ని రుచి చేయిస్తాడు దీంతో వాళ్లు దేవరకు ఎదురెళ్తారు. అంతమొందించడానికి రెడీ అవుతారు ఈ క్రమంలోనే దేవర ఒకరోజు అదృశ్యమవుతాడు. దేవర ఆచూకీ కోసం భైరా.. తన మనుషు లు వెతుకుతూనే ఉంటారు. మరోవైపు దేవర బిడ్డ దేవర కి పూర్తి బిన్నంగా భయస్తుడిగా అదే ఎర్ర సముద్రం లో జీవనం కొనసాగిస్తుంటారు. వార ఎందుకు ఆలా మారిపోయాడు. అస్సలు దేవర ఎక్కడకి వెళ్ళాడు, మళ్ళీ ఎర్ర సముద్రం వాళ్ళు సంద్రం ఎక్కారు లేదా. కనపడకుండా అదృశ్యమైన దేవర ని మళ్ళీ వెనక్కి వచ్చాడా. భైర ఎం అయ్యాడు అనే ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే
కొత్త ప్రపంచం , వాళ్ళ అలవాట్లు, అక్కడి పరిస్థితులు ,సంఘటనలు చూపిస్తూ ముందుకి వెళ్లడం ఈ తరం దర్శకుల ఎంచుకున్న కొత్త పంథా. కొరటాలకి ఈ టైపు కథనం చెప్పడం రెండో సారి. ఆచార్య తో ఇలాంటి నేపధ్యాన్ని ఎన్నుకొని సక్సెస్ అవ్వని కొరటాల పంతం పట్టి మరి అలంటి నేపధ్యాన్ని తీసుకొని దేవర తీసాడు. జరిగిన తప్పుని విశ్లేషించుకుని ఈ సారి కత్చితంగా సక్సెస్ అవుతాడని అందరూ అనుకున్నారు , అలాగే ఎన్టీఆర్ కూడా తన గత ఆరు సినిమాల నుంచి స్టోరీ సెలక్షన్ లో మంచి జడ్జిమెంట్ చూయిస్తూ వస్తుండడంతో దేవర కత్చితం గా బ్లాక్ బస్టర్ అవుతందనే నమ్మకాలూ ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ లు అనుకున్నంత లేకపోయినా సినిమా మీద భారీ హైప్ అయితే వచ్చేసింది. ఆ అంచనాలని సినిమా మొత్తంగా అందుకుంది అని చెప్పలేం గాని సగానికి పైగానే ప్రేక్షకులిని మెప్పించింది అనిమాత్రం చెప్పచ్చు.

సముద్ర నేపధ్యం , ఒకే ఊరి కి సంబంధించిన నాలుగు పెద్దింటి మనుషుల మధ్య కొట్లాట ఈ సెటప్ చూస్తే కొరటాల ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడు అనిపిస్తుంది. దానికి తగ్గట్టు గానే ఎలేవేషన్ డైలాగ్స్ తో , హీరో ఇంట్రడక్షన్ సీన్స్, బ్యాక్ డ్రాప్ కొత్తగా అనిపిస్తాయి. దానికి తోడు అనిరుద్ బీజీఎం సినిమా ని ఒక రేంజ్ లో తీసుకెళ్తాయి కానీ అంతే వేగంగా కిందకి దించేసాడు దర్శకుడు అనడంలో సందేహం లేదు. కానీ మొదటి సగం పరంగా ప్రేక్షకుడికి పెద్దగా కంప్లైంట్ ఉండదు. సినిమా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుధ పూజ సాంగ్ , ఆ తర్వాత వచ్చే ఫైట్, ఎలేవేషన్ సీన్ అన్ని చక్కగా కుదిరాయి. ఇంటర్వెల్ ఈ సినిమా కి మరో హైలైట్ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ చక్కగా రాసుకున్నాడు దర్శకుడ.
మొదటి సగం దేవర కి ఇచ్చేసిన దర్శకుడు మలి సగం వర కి ఇచ్చేసాడు. భయస్థుడైన హీరో తండ్రి చేసేవాటికి దూరంగా వుంటూ, తండ్రి అంటేనే ఇష్టంలేకుండా ఉంటాడు. హీరోయిన్ జాహ్ణవి ఎంట్రీ కూడా ఇక్కడే వస్తుంది. జాహ్నవి వున్నది తక్కువ సేపే ఐన నటన, అందం తో మనల్ని కట్టిపడేస్తుంది. వర, తంగం మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అందంగా చిత్రీకరించారు
ఇంక ఆ తర్వాత కాసేపు సినిమా సాగదీత సన్నివేశాలతో ముందుకు నడిపించాడు దర్శకుడు
మళ్ళీ సినిమా పట్టాలెక్కేది ప్రీ- క్లైమాక్స్ లోనే. అక్కడ వచ్చే సముద్రం సన్నివేశాలు గూసిబంప్స్ తెప్పిస్తాయి. పార్ట్ 2 కి లీడ్ ఇస్తూ కథ ముగించాడు దర్శకుడు. క్లైమాక్స్ లో కొరటాల తనలోని రైటర్ ని బాగా వాడుకున్నాడు. పార్ట్ 2 లీడ్ కి వాడుకున్న సన్నివేశం మాత్రం ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ ఐన ఒక సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందాడు అనడం లో సందేహం లేదు.

Read Also :  ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌

నటీనటుల పనితీరు

దేవర గా , వర గా ఎన్టీఆర్ అత్యద్భుతంగా నటించాడు. సినిమాని కంప్లీట్ గా వన్ మ్యాన్ షో చేసాడనే చెప్పచ్చు. రెండు పాత్రలకి చక్కటి డిఫరెన్స్ చూయిస్తూ ఆ పాత్రలకి ప్రాణం పోసాడు

దేవర తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాహ్ణవి తొలి సినిమాతోనే ఆకట్టుకుందని చెప్పాలి. వరని ప్రేమించే తంగమ్మగా జాహ్నవి ఇందులో చాలా తక్కువ సమయమే ఉంది. కొన్ని సీన్లు, ఒక పాటతో సర్ధేశారు. ఉన్నంతలో చలాకీగా, అందంగా కనిపించడమే కాక హుషారుగా నటించింది.

ఇక సైఫ్ కూడా తన పాత్ర మేరకు నటించాడు పెద్దగా మెరుపులు కనపడలేదు. ఇక మిగిలిన నటులు ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , షైన్ టామ్ చాకో , చైత్ర వాళ్ళకి ఇచ్చిన పాత్రలు వరకు న్యాయం చేసారు అనే చెప్పాలి. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమాకి పెద్ద అసెట్ అనిరుద్ మ్యూజిక్. తాను లేకుండా ఈ సినిమా ని ఊహించుకోలేం అంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా కి ఎంతగా తాను న్యాయం చేసాడనేది . రత్నవేలు కెమెరా పనితనం, ఎర్ర సముద్రాన్ని ప్రేక్షకులకి చూపించిన వైనం మరొక పెద్ద ఆకర్షణ ఈ సినిమా కి.

దర్శకుడు కొరటాల తన ముందు చిత్రం ఎందుకు ప్లాప్ ఐంది అలా అవ్వకూడదు అని అనుకోని ఈ సారి గట్టిగా ప్రయత్నించి తీసిన సినిమా దేవర అని చెప్పడం లో సందేహం లేదు

కథ.. నేపధ్యం , పాత్రల వేషధారణ ‘ఆచార్య’తో పోలికలు కనిపించినప్పటికీ ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిపోవడం ప్రతి సన్నివేశం లో కూడాను ఏదోకటి వర్క్ అవుట్ అయేటట్టు ఉండడం తో ఎక్కువ సన్నివేశాలు పాస్ అయిపోయాయి అనే చెప్పాలి.

మొదటి సగం లో ఎర్రసముద్రం నేపథ్యం ప్రేక్షకుడిని కధలో లీనమయ్యేలా చేస్తుంది. విజువల్స్ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. యాక్షన్, పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు మంచి ఫీల్ ని ఇస్తాయి.

ద్వితీయార్ధంలో ఎర్ర సముద్రం వ్యవహారం సాగతీతగా ఎక్కువ అయింది. ‘దేవర’ కథ లో .. వర పాత్రకు సంబంధించి అతి ముఖమైన సీన్ ఆల్రెడీ ప్రేక్షకులు ఊహించేయడం ఈ సినిమా కి అతి పెద్ద మైనస్ దీనికి భిన్నంగా దర్శకుడు కొరటాల ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘దేవర’ కోసం కొరటాల ఎంచుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఈ సినిమాకి ఒక అసెట్ అనే చెప్పుకొవచ్చు
కథ లో కొత్తదనం లేకపోయినా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే అంశాలకు లోటు లేదు.
ఎన్టీఆర్ కోసం, యాక్షన్, కోసం, అద్భుతమైన సాంకేతిక హంగుల కోసం ‘దేవర’ ని నిస్సందేహం గా చూసేయచ్చు . పార్ట్-2 ఎలా డీల్ చేస్తాడు కొరటాల అనేది ప్రేక్షకుడి మధిలో వున్న అతి పెద్ద ప్రశ్న

చివరగా
దేవరా….సాగదీత తగ్గించాల్సింది
Filmy Bowl Rating: 2.5/5

Follow us on Instagram

The post దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-part-1-movie-full-review/feed/ 0
మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/mathu-vadalara-2-movie-full-review/ https://filmybowl.com/telugu/mathu-vadalara-2-movie-full-review/#respond Thu, 26 Sep 2024 07:19:52 +0000 https://filmybowl.com/telugu/?p=391 Mathu Vadalara 2 Movie Full Review తారాగణం: శ్రీ సింహ , సత్య, ఫారియా అబ్దుల్లా , సునీల్, వెన్నెల కిషోర్, అజయ్,రాజా, రోహిణి, ఝాన్సీ, సుదర్శన్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రొడక్షన్: క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్: చెర్రీ , హేమలత రైటర్ & డైరేక్షన్: రితేష్ రానా మ్యూజిక్: కాల భైరవ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13, 2024 మత్తువదలరా...

The post మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Mathu Vadalara 2 Movie Full Review
Mathu Vadalara 2 Movie Full Review

Mathu Vadalara 2 Movie Full Review

తారాగణం: శ్రీ సింహ , సత్య, ఫారియా అబ్దుల్లా , సునీల్, వెన్నెల కిషోర్, అజయ్,రాజా, రోహిణి, ఝాన్సీ, సుదర్శన్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు
ప్రొడక్షన్: క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రి మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్స్: చెర్రీ , హేమలత
రైటర్ & డైరేక్షన్: రితేష్ రానా
మ్యూజిక్: కాల భైరవ
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13, 2024

మత్తువదలరా సినిమాతో హీరో గా ఎంట్రీ తో నే మంచి విజయాన్ని అందుకున్న శ్రీసింహా కి ఆ తర్వాత నాలుగు సినిమాలు చేసిన హిట్ పలకరించలేదు.దాంతో తనకి మొదటి హిట్ ఇచ్చిన సినిమా కి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ , ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కి ప్రభాస్ , రాజమౌళి ని దింపడం తో సినీ ప్రేమికుల ద్రుష్టి ఈ సినిమా మీద పడింది.

మంచి అంచానాలతో ఈరోజు రిలీజ్ ఐన సినిమా ఎలా వుంది , సింహ కి సక్సెస్ దాహం తీర్చిందో లేదో చూద్దాం పదండి.

కథ
మత్తువదలరా సినిమా ఎక్కడైతే శుభం కార్డు పడిందో అక్కడ నుంచే మత్తువదలరా2 కథ మొదలవుతుంది. డెలివరీ ఏజెంట్స్ ఐన బాబూమోహన్ (సింహా) , యేసు (సత్య) లకి చేస్తున్న ఉద్యోగం పోవడం తో వేరొక జాబ్ ట్రైల్స్ లో వుంటారు. అదే సమయం లో హి టీం (హై ఎమర్జన్సీ టీం) లో ఉద్యోగాలు వున్నాయి అని పేపర్ లో చూసి తెలుసుకొని లంచం ఇచ్చి మరి ఆ ఉద్యోగాల్లో చేరిపోతారు. అక్కడ వీళ్ళ డ్యూటీ కిడ్నప్ కేసుల్ని డీల్ చేయడం.

ఒకే టీం లో పని చేస్తూ వచ్చే జీతం డబ్బులు సరిపోక కిడ్నప్ కేసుల్లో దొరికే సొమ్ము నుంచి కొంత “తస్కరించి” జీవితం గడిపేస్తుంటారు. కిడ్నాపర్లని పట్టుకొనే సమయం లో డబ్బు పోయిందని వీళ్ళ హెడ్ దీప (రోహిణి) కి కధలు చెప్పి తప్పించుకుంటుంటారు. ఎవరో తన కూతుర్ని కిడ్నప్ చేసి రెండు కోట్ల రూపాయిలు అడుగుతున్నారని బాబు, యేసులని సంప్రదిస్తుంది దామిని . ఇదే అదునుగా హి టీం తో సంబంధం లేకుండా ఈ కేసు ని తామే డీల్ చేసి ఆ రెండు కోట్లు నొక్కెయ్యాలని ప్లాన్ వేస్తారు. ఆ క్రమంలో అనుకోకుండా ఒక మర్డర్ కేసు లో ఇరుక్కుంటారు బాబు, యేసు.

ఆ మర్డర్ కేసు ఏంటి. ఆ మర్డర్ చేసింది ఎవరు. ఈ కేసు నుంచి బాబు,యేసు తప్పించుకోడానికి సీనియర్ అధికారి ఐన నిధి (ఫారియా) ఎలా సహాయ పడింది. ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసారు అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే:
ఈ మధ్య సీక్వెల్స్ సర్వ సాధారణం అయిపోయింది అలా అని సీక్వెల్ కి వుండే అర్ధానికి తగ్గట్టు తీస్తున్నారా అంటే అది లేదు

బాహుబలి సీక్వెల్ వచ్చిందంటే కథ కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడొస్తున్న సీక్వెల్స్ అన్ని పార్ట్ 1 ని కొంచెం అటు ఇటు కలిపి తీస్తున్నారు. అలాగే ఈ సినిమా ని పార్ట్ 1 కి కంటిన్యూ అనడం కంటే పార్ట్ 1 నే మళ్లీ చిన్న చేంజెస్ తో తీశారు అనుకోవచ్చు. పార్ట్ 1 కధనం లో వున్నా వేగం గాని, కథ గాని ఈ సీక్వెల్ లో లేవు, అలా అని సినిమా బాలేదా అంటే చాలా చోట్ల బావుంది. సత్య ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇవేమి గుర్తుకు రాకుండా చేస్తాయి .

పార్ట్ 1 చూసి థియేటర్ కి వచ్చిన వాళ్ళకి ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ఆ పాత్రలతో కనెక్షన్ వచేసిద్ధి. సినిమా మొదటి హాఫ్ మొత్తం పాత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటది. అలంటి మొదటి సగం పూర్తి అయ్యేసరికి దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం విపరీతంగా ఆకట్టుకునిద్ది. రెండో హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రీయట్ చేసిద్ధి

ఇక రెండో హాఫ్ మొత్తం పార్ట్ 1 లో లాగానే మర్డర్ మిస్టరీ మీదే నడిపించాడు
మర్డర్ మిస్టరీ రివీల్ మొత్తం అంతగా ఆకట్టుకోదు కానీ మధ్య మధ్య లో సత్య ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తో ఇవన్నీ కవర్ అయిపోతాయి. మధ్యలో ఒక హీరో పాత్ర , ఒక సీరియల్ డ్రామా కూడా సో సో గా నడుస్తాయి.

ప్రీ-క్లైమాక్స్ నుంచి మళ్లీ దర్శకుడి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అక్కడ వచ్చే చిన్న ట్విస్టులు , సినిమా ప్రధాన తారాగణం కలిసి చేసే ఒక ఫైట్ బాగా ఆకట్టుకునిద్ది , సత్య వేసే ఒక డాన్స్ ప్రేక్షకులకి సినిమా మీద మంచి ఒపీనియన్ తో బయటకి వచ్చేలాగా చేస్తుంది

పార్ట్ త్రీ కి కూడా అవకాశం ఉందనే హింట్ ఇస్తూ పార్ట్ 2 ని ముగించాడు దర్శకుడు.

Read Also : సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా
సింహా, సత్య మధ్య కామెడీ కెమిస్ట్రీ ఫుల్ గా వర్కౌట్ ఐంది. ఒక మాటలో చెప్పాలంటే సత్య ఈ సినిమా కి పెద్ద అసెట్. దర్శకుడి లోపం ఉన్న సీన్స్ కూడా స్క్రీన్ మీద పండాయి అంటే దానికి కారణం సత్య కామెడీ టైమింగ్. మంచి పాత్రలు పడితే సత్య ని ఆపలేం అనడానికి ఈ సినిమా నిదర్శనం.

ఈ సినిమా కి సరికొత్త ఆకర్షణ ఫారియా అబ్దుల్లా . ఆక్షన్ + సస్పెన్సు ఉన్న క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. ఇంకా మిగిలిన ఆర్టిస్ట్స్ అందరూ ఇచ్చిన పరిధిలో ఆకట్టుకున్నారనే చెప్పాలి

కాల భైరవ కథ కి సరిపడా BGM తో సీన్స్ ని చాల వరకు ఎలేవేటే చేసాడు. సినిమా కి అనుకున్న బడ్జెట్ లో రిచ్ గా కనిపించింది, ఎడిటింగ్ & సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరాయి

ఇక డైరెక్టర్ రితేష్ రానా లో చాలా మంచి హ్యూమర్, సెటైరికల్ కళ చాలా చోట్ల కనపడింది
నచ్చిన వాళ్ళకి ఇంకా నచ్చేసిద్ధి
యేసు పాత్ర మీతోనే వస్తు మిమ్మల్ని బాగా నవ్విస్తుంది

చివరగా

మత్తువదలరా3 – సత్య కోసం ఎదురుచూస్తుంటారు
Filmy Bowl Rating: 3/5

Follow us on Instagram

The post మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mathu-vadalara-2-movie-full-review/feed/ 0
సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/saripodhaa-sanivaaram-movie-full-review/ https://filmybowl.com/telugu/saripodhaa-sanivaaram-movie-full-review/#respond Thu, 26 Sep 2024 06:59:35 +0000 https://filmybowl.com/telugu/?p=386 Saripodhaa Sanivaaram Movie Full Review Saripodhaa Sanivaaram Movie ఎలా ఉందొ ఒక లుకేద్దాం తారాగణం: నాని, ప్రియాంక, ఎస్ జె సూర్య, సాయికుమార్ ,మురళీశర్మ , అజయ్ ఘోష్ , శుభలేఖ సుధాకర్, బాబూమోహన్ తదితరులు ప్రొడక్షన్: డివీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్: దానయ్య రైటర్ & డైరేక్షన్: వివేక్ ఆత్రేయ మ్యూజిక్: జాక్స్ బిజోయ్ రిలీజ్ డేట్: ఆగష్టు 29, 2024 హీరో – దర్శకుడు కలయిక...

The post సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Saripodhaa Sanivaaram Movie Full Review
Saripodhaa Sanivaaram Movie Full Review

Saripodhaa Sanivaaram Movie Full Review

Saripodhaa Sanivaaram Movie ఎలా ఉందొ ఒక లుకేద్దాం

తారాగణం: నాని, ప్రియాంక, ఎస్ జె సూర్య, సాయికుమార్ ,మురళీశర్మ , అజయ్ ఘోష్ , శుభలేఖ సుధాకర్, బాబూమోహన్ తదితరులు
ప్రొడక్షన్: డివీవీ ఎంటర్టైన్మెంట్స్
ప్రొడ్యూసర్స్: దానయ్య
రైటర్ & డైరేక్షన్: వివేక్ ఆత్రేయ
మ్యూజిక్: జాక్స్ బిజోయ్
రిలీజ్ డేట్: ఆగష్టు 29, 2024

హీరో – దర్శకుడు కలయిక లో వచ్చిన మొదటి చిత్రం ANTE SUNDARANIKI కల్ట్ సినిమాగా పేరొచ్చినా ఆడలేదు
ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలన్న కసి ఇద్దరిలో వుంది. అదే కసి  సినిమా లో కూడా కనిపించింది అనడంలో అతిశేయోక్తి లేదు

చాలా మంది దర్శకులు ఒక కాన్సెప్ట్ తో సినిమా తీస్తుంటారు
మరికొద్ది మంది దర్శకులు కమర్షియల్ ఎలిమెంట్ ని నమ్ముకొని సినిమా తీస్తుంటారు
ఈ రెండిటిని నమ్ముకోని దర్శకుడు ఒక సినిమా తీస్తే అదే సరిపోదా శనివారం

కథలోకి వెళ్తే ప్రతి సారి వినేదే
హీరో కి చెప్పలేనంత కోపం , ఎప్పుడు గొడవ కి ముందుంటాడు
తండ్రికి గొడవలు అంటే నచ్చవు
అందుకే హీరో తల్లి హీరో నుంచి ఒక మాట తీసుకుంటది
శనివారం మాత్రమే నీ కోపం చూయించు, మిగిలిన 6 రోజులు నీ కోపం దాచుకో
అలా హీరో తన కోపాన్ని మిగిలిన రోజులు ఒక డైరీ లో దాచుకుంటాడు. శనివారం మాత్రం ఆ కోపమొచ్చిన వాళ్ళ మీద విశ్వరూపం చూయిస్తుంటాడు.

ఇక విల్లన్ దయానంద్ (ఎస్ జె సూర్య) ఒక సైకో పోలీస్ ఆఫీసర్ తన కోపానికి కారణమైన అన్నయ ని అందలం ఎక్కించినందుకు సోకులపాలెం అనే గ్రామంలో ని ప్రజలని చితక్కొడుతుంటాడు.

హీరోయిన్ చారులత (ప్రియాంక) తన పై అధికారి సైకోయిజం చూసి అతన్ని ఎం చేయలేక సోకులపాలెం ప్రజలకి ఎలా ఐన సాయం చెయ్యాలని చూస్తుంటది.

ఈ మధ్యలో చారు తో సూర్య కి ప్రేమ. ఆ ప్రేమ లో సోకులపాలెం ప్రజలకి సూర్య చేసే సాయం ఏంటి ?
పోలీస్ ఆఫీసర్ కి, సూర్య కి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటి? వాడి నుంచి ప్రజలని ఎలా కాపాడాడు
చిన్నప్పుడే తప్పిపోయిన సూర్య మరదలు కళ్యాణి ఏమైంది?
సూర్య సోదరి పెళ్ళిలో ఎం జరిగింది ?

ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా
సింపుల్ గా చెప్పాలంటే
ఒక హీరో ,ఒక విలన్, ఒక ఊరు
ఊరుని పీడించే విలన్ , విలన్ ని ఎదిరించే హీరో, ఆఖరికి సంతోషం లో ఆ ప్రజలు – ఇదే కథ

ఎన్ని సినిమాల్లో చూసుంటారు ఇదే స్టోరీ ని కానీ సరిపోదా శనివారం లో ఇది మాత్రమే కాదు
ఒక చిన్న కాన్సెప్ట్ తో కథ కి కొత్త రూపం ఇచ్చాడు దర్శకుడు

హీరో- దర్శకుల నిజ జీవితం లో ఉన్న కసి ని ఈ సినిమా లో విలన్ కి పెట్టేసారు
ఇక చెప్పేదేముంది దయ పాత్రలో ఎస్ జె సూర్య చెలరేగిపోయాడు

ఎంతలా అంటే ఒకానొక దశలో హీరో -విలన్ పోటా పోటీ అన్నట్టు నటిస్తే
మరొకసారి విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ని దాటేసింది అనాలి
ఎస్ జె సూర్య లేకపోతే సరిపోదా శనివారం లేదు అన్నట్టుంటది దయా క్యారెక్టర్

వివేక్ ఆత్రేయ ఈ కథ కి చాల కష్టపడ్డాడు . ప్రతి చిన్న విషయం కూడా డిటైల్డ్ గా చేయించి దాన్ని స్క్రీన్ప్లే లో భాగం చేసి సినిమా కి కావాల్సిన సమయానికి మలుపు లు ఇచ్చాడు (వాల్ క్లాక్ పది నిముషాలు సీన్)

Read Also : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

నాని చైల్డ్ హుడ్ సీన్స్ సాగదీతలనే ఉంటాయి కానీ ఇక్కడ దర్శకుడు తన సినిమా ని చాల క్లియర్ గా ప్రేక్షకుడికి చెప్పాలనుకున్నాడు. అలా చెప్పడంలో ఈ సారి మాత్రం డిస్టింక్షన్ లోనే పాస్ అయ్యాడు

దర్శకుడు ఇలా పాస్ అవ్వడానికి అతని టెక్నికల్ టీం చాల కృషి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని కరెక్ట్ గా కుదిరిన సినిమా ఇది. పైగా దర్శకుడు ఈ సినిమా ని విభజించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అదేంటో మీరు సినిమాలోనే చుడండి

కథ నచ్చితే దర్శకుడు ఎవరు, అనుభవం ఏంటి అని చూడని హీరో నాని
అలాంటిది తనకి నచ్చిన దర్శకుడు తనకి ఇష్టమైన కథనే తీసుకొస్తే నాని ఎలా చెలరేగిపోతాడో ఈ సినిమాలో చూడచ్చు
సూర్య పాత్ర ని నాని చాలా ఈజ్ తో చేసాడని చెప్పచ్చు
నాని సినిమా అంటే ఎంత మంది నటీనటులు వున్నా సినిమా నుంచి బయటకి వచ్చేటపుడు నాని మాత్రమే గుర్తుంటాడు అలాంటిది ఈ సినిమా లో నాని తో పాటు ఎస్ జె సూర్య కూడా గుర్తుకు వస్తాడు అంటే దయాపాత్ర ఎంత బాగా చేసాడో మీ ఊహకే వదిలేస్తున్నాం

ఇంకా హీరోయిన్ గా ప్రియాంక , నాని తండ్రి పాత్రలో సాయికుమార్ అద్భుతంగా నటించారు. మురళిశర్మ పాత్ర కూడా కధకి ఉపయోగే పడే విధంగా ఉంటుంది

ఇంకా వివేక్ ఈ సినిమా తో మంచి హిట్ కొట్టాడు. తన కెరీర్ తో పాటు నాని కి ఉన్న హిట్ బాకీ కూడా తీర్చేసాడు.

చివరగా

సరిపోదా శనివారం – ఆడియన్స్ కి ఫుల్ గా సరిపోయిద్ది
Filmy Bowl Rating: 3.25/5

Follow us on Instagram

The post సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/saripodhaa-sanivaaram-movie-full-review/feed/ 0
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/the-greatest-of-all-time-goat-movie-full-review/ https://filmybowl.com/telugu/the-greatest-of-all-time-goat-movie-full-review/#respond Thu, 26 Sep 2024 06:45:05 +0000 https://filmybowl.com/telugu/?p=383 The Greatest of All Time – GOAT Movie Review తారాగణం: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రభుదేవా, జయరాం , ప్రశాంత్, మోహన్, వైభవ్, ప్రేమ్ జీ అమరన్, అమీర్ అజ్మల్ తదితరులు ప్రొడక్షన్: ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్: కల్పత్తి అఘోరం, కల్పత్తి గణేష్, కల్పత్తి సురేష్ రైటర్ & డైరేక్షన్: వెంకట్ ప్రభు మ్యూజిక్: యువన్ శంకర్ రాజా రిలీజ్ డేట్: సెప్టెంబర్ 5,...

The post ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
The Greatest of All Time - GOAT Movie Full Review
The Greatest of All Time – GOAT Movie Full Review

The Greatest of All Time – GOAT Movie Review

తారాగణం: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రభుదేవా, జయరాం , ప్రశాంత్, మోహన్, వైభవ్, ప్రేమ్ జీ అమరన్, అమీర్ అజ్మల్ తదితరులు
ప్రొడక్షన్: ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్
ప్రొడ్యూసర్స్: కల్పత్తి అఘోరం, కల్పత్తి గణేష్, కల్పత్తి సురేష్
రైటర్ & డైరేక్షన్: వెంకట్ ప్రభు
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 5, 2024

మురుగదాస్ దర్శకత్వం లో వచ్చిన తుపాకీ సినిమా తో తనకంటూ తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న తమిళ హీరో తలపతి విజయ్ . అప్పటి నుంచి వరుసగా అన్ని సినిమాలు తెలుగు లో డబ్ చేస్తూ తన రేంజ్ అతకంతకు పెంచుకుంటూ వెళ్ళాడు
పోయిన ఏడాది LEO తో భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న విజయ్. ఇప్పుడు The Greatest of All Time – GOAT  సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరి ఆ గ్రేట్ నెస్ ఏంటో ఒక లుక్కేద్దాం పదండి

కథ ఏంటంటే

గాంధీ (విజయ్) ఒక సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం భార్య (స్నేహ) కి కూడా తెలీకుండా జాగ్రత్తపడుతుంటాడు
అజయ్ (అజ్మల్), కళ్యాణ్ (ప్రభుదేవా) , సునీల్ (ప్రశాంత్) అతని టీం మెంబెర్స్. నజీర్ (జయరాం) వీలందరికి బాస్.

ఒక సీక్రెట్ మిషన్ మీద థాయిలాండ్ వెళ్తున్న గాంధీ ని భార్య అనుమానించడంతో వెకేషన్ అని చెప్పి భార్య ని , కొడుకు ని తీసుకొని బయల్దేరతాడు. అక్కడ భార్య కి చెప్పకుండా ఒక మిషన్ లో పాల్గొంటాడు. గాంధీ వళ్ళ నష్టపోయిన ఒక బ్యాచ్ గాంధీ ఫామిలీ మీద ఎటాక్ చేయడంతో, గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు

ఇదంతా చుసిన గాంధీ భార్య తనతో విభేదించి దూరమవుతుంది. గాంధీ కూడా భార్య కి దూరంగా వుంటూ తన సీక్రెట్ ఏజెంట్ పనిని కొనసాగిస్తుంటాడు. కొన్నేళ్ల తర్వాత ఒక పని మీద రష్యా వెళ్లిన గాంధీ కి అక్కడ తన పోలికలతో ఉన్న జీవన్ ఎదురవుతాడు. అతనే తన కొడుకు అని తెలుసుకుని ఇంటికి తీసుకొస్తాడు గాంధీ. కానీ ఇక్కడి నుంచే గాంధీ కి అసలు సమస్యలు మొదలవుతాయి. తనకి ఏదో చెప్పాలని పిలిపించుకునే సమయం లోనే తన బాస్ చనిపోవడం , ఆ మిస్టరీ ఛేదించే సమయం లో తన టీం మెంబెర్స్ ఒకొక్కళ్ళు చనిపోవడం తో గాంధీ కి సవాళ్లు ఎదురవుతాయి. తన బాస్ ని, తన టీం ని చంపింది ఎవరు? అస్సలు ఇన్నాళ్లు జీవన్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

సినిమా ఎలా ఉందంటే:
గ్యాంబ్లర్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకుడు
అద్భుతమైన ఫాo లో ఉన్న తలపతి విజయ్
పైగా విజయ్ ఇక సినిమాలు చేయడు, రాజకీయాలకి వెళ్ళిపోతున్నాడనే ఎమోషన్ తో
ఈ సినిమా ని ఆదరిద్దామని హాల్ లోకి వెళ్లిన ప్రేక్షకుడి కి సినిమా చాలా రొటీన్ గా ఉందనే భ్రమలోనే ఉంటాడు
డీ ఏజింగ్ ఎఫెక్ట్ తో చేసిన సీన్స్ ట్రైలర్ లో చూసి విజయ్ ని ట్రోల్ చేద్దామని హాల్ కి వచ్చినవాళ్లు కూడా అలాగే ఎం చేయలేక కుర్చుండి పోతారు

ఈ మాట ఎందుకంటునంటే ఈ సినిమా కి ఊపిరి వచ్చేది జీవన్ పాత్ర తెర పై కనపడ్డప్పుడే . కాస్త ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేది ఆ పాత్రతోనే

ఇలాంటి కథ ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిందే. హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ , అతని వాళ్ళ ఫామిలీ ఇబ్బందుల్లో పడటం, సొంత టీం ఏ హీరో కి నమ్మకద్రోహం చేయడం.. ఈ విషయం తెలుసుకొని హీరో వాళ్ళందరిని అంతమొందించడం. కాకపోతే ఇదే కథ లో తండ్రి -కొడుకుల మధ్య శత్రుత్వం పెట్టి వెంకట్ ప్రభు తనదైన స్క్రీన్ ప్లే తో సినిమా ని ఉన్నంతలో బానే నడిపించాడు. కావలసినప్పుడు తండ్రి- కొడుకు మధ్య ఎమోషన్ ని వాడుకున్నాడు అదే టైం లో ఎలేవేషన్ కి వాడుకున్నాడు .

మొదటి సగం లో హీరో ఎంట్రీ ఫైట్, ఇంటర్వెల్ మెట్రో ట్రైన్ ఫైట్ తప్పిస్తే మధ్యలో అంత రొటీన్ వ్యవహారమే
ఇంటర్వెల్ ఫైట్ తో సెకండ్ హాఫ్ మీద మంచి అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలని దర్శకుడు బానే అందుకున్నాడని చెప్పచ్చు

సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్స్ , స్క్రీన్ ప్లే లోని మేజిక్ సినిమా ని గట్టెక్కిస్తాయి. ఇక క్లైమాక్స్ లో అందరూ చెపుకున్నట్టే IPL మ్యాచ్ ని , ధోని ఇమేజ్ ని చక్కగా వాడుకున్నాడు.

Read Also : 35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

నటీనటుల పనితీరు

విజయ్ నటనకి వంక పెట్టలేం. డాన్సులు ,ఫైట్లు , కొన్ని హెరొఇచ్ మూమెంట్స్ ఇవన్నీ ఎప్పటిలానే అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా లో కొత్తదనం విజయ్ హీరోఇస్ం తో పాటు విలనిజం కూడా చూడచ్చు. హీరో కంటే విలన్ గా విజయ్ కి ఈ సినిమా లో ఎక్కువ మార్కులు పడతాయి

ఇక సినిమాలోని విజయ్ టీం అందరూ చక్కటి నటన ప్రదర్శించారు , భార్య గా స్నేహ చూడముచ్చటగా వుంది.
మీనాక్షి చౌదరి కనిపించేది కాసేపే ఐన చక్కగా నటించింది. యోగి బాబు కామెడీ కూడా కాసేపు పర్వాలేదు అన్నట్టు ఉంటది

స్పెషల్ అప్పీరెన్స్ లో కెప్టెన్ విజయకాంత్ సినిమా ప్రారంభంలో కనిపించడం చాల బావుంది , అలాగే శివ కార్తికేయ ఎంట్రీ కూడా బాగా పండింది.

ఇక వెంకట్రప్రభు టెక్నికల్ టీం అందరూ కలిసికట్టుగా పని చేసారు
అనిరుద్ మాయ నుంచి బయటకి వచ్చి వింటే యువన్ కూడా మంచి పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చాడనే చెప్పచ్చు
డీఎజింగ్ కాన్సెప్ట్ బానే వుంది. కెమెరా పనితనం మరొక హైలైట్ అని చెప్పచ్చు. నిర్మాత ఎక్కడ ఖర్చుకి వెనకడుగు వేయలేదు అనే చెప్పాలి

చివరగా

గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం – ఇది వెంకట్ ప్రభు గ్యాంబ్లర్ రేంజ్ కాదు
Filmy Bowl Rating: 2.75/5

Follow us on Instagram

The post ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-greatest-of-all-time-goat-movie-full-review/feed/ 0
35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/35-chinna-katha-movie-full-review/ https://filmybowl.com/telugu/35-chinna-katha-movie-full-review/#respond Thu, 26 Sep 2024 06:31:15 +0000 https://filmybowl.com/telugu/?p=380   35 chinna katha Movie Review తారాగణం: నివేథా థామస్, విశ్వదేవ్ , ప్రియదర్శి, మాస్టర్ అరుణ్, భాగ్యరాజ్, రేవతి, కృష్ణతేజ తదితరులు ప్రొడక్షన్: సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ , వాల్టాయిర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్: సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్ళపల్లి రైటర్ & డైరేక్షన్: నందకిశోర్ యేమాని మ్యూజిక్: వివేక్ సాగర్ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2024 చిన్న సినిమా , పెద్ద సినిమా...

The post 35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
35 chinna katha Movie Full Review
35 chinna katha Movie Full Review

 

35 chinna katha Movie Review

తారాగణం: నివేథా థామస్, విశ్వదేవ్ , ప్రియదర్శి, మాస్టర్ అరుణ్, భాగ్యరాజ్, రేవతి, కృష్ణతేజ తదితరులు
ప్రొడక్షన్: సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ , వాల్టాయిర్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్: సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్ళపల్లి
రైటర్ & డైరేక్షన్: నందకిశోర్ యేమాని
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2024

చిన్న సినిమా , పెద్ద సినిమా అంటూ ఏమి లేదు
రిలీజ్ కి ముందు ఏదైనా చిన్న సినిమానే…. ప్రేక్షకుడు ఆదరించిన సినిమానే పెద్ద సినిమా అన్నట్టుంది ఈరోజు ఇండస్ట్రీ

బడా హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలని రెండేళ్ల కి ఒక సరి రిలీజ్ కి వస్తుంటే ఈ లోపు చిన్న సినిమా వాటి హవా ని చూపించేసి వెళ్తున్నాయి. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ ఎంత పెద్ద విజయాలు సాధించాయి అందరికి తెలిసిందే అలాగే ఇప్పుడు ఈ 35 chinna katha Kadu కూడా అంతటి విజయాన్ని సాధించింది అనటం లో సందేహం లేదు
దగ్గుబాటి రానా లాంటి పెద్ద స్టార్ చేయి పడితే ఆ సినిమా ప్రమోషన్స్ కి కొదవేముంటది. అందుకే రిలీజ్ కి ముందే ఈ సినిమా మంచి బజ్ ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం పదండి

కథ :
ప్రసాద్ (విశ్వదేవ్) , సరస్వతి (నివేధా) తిరుపతి లో నివాసముండే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం
వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అరుణ్ (పెద్దొడు) , వరుణ్ (చిన్నోడు). అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో లాగే సరస్వతి కి భర్త, పిల్లలే ప్రపంచం. పిల్లలని బాగా చదివించి వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలనీ కష్టపడుతుంటారు.

చిన్నోడు వరుణ్ బాగా చదువుతాడు , ఆలా అని అరుణ్ చదువురానోడు ఎం కాదు. లెక్కలు తప్ప అన్నిట్లో మంచి మార్క్స్ వస్తాయి. లెక్కల్లో ఎందుకు వీక్ అనేది కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. అరుణ్ అడిగిన సందేహాల్ని ఉపాధ్యాయులు తీర్చకపోడం తో అరుణ్ కి గణితం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. అలా చదవకపోడం తో గణితం లో సున్నాలు వస్తుంటాయి.
అదే సమయం లో ఆ స్కూల్ కి వచ్చిన కొత్త లెక్కల మాస్టర్ చాణక్య (ప్రియదర్శి) వల్ల అరుణ్ కి ఇబ్బందులు మొదలవుతాయి. ఆ ఇబ్బందులు వల్ల కుటుంబం వరకు వెళ్లి అరుణ్ ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి కి వస్తాడు .

ఇల్లు వదిలి వెళ్లిన అరుణ్ తిరిగి వచ్చాడా లేదా?.
తనకి గణితం మీద ఉన్న ఆలోచనని ఎవరు మార్చారు?
ఈ సారి ఐన పాస్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ…. అది సినిమా చూసి తెలుసుకుందాం

సినిమా ఎలా ఉంది:
సినిమా అంటే పాటలు , ఫైట్లు , మాస్, రొమాన్స్ , కాస్త అడల్ట్ కంటెంట్ ఇవే నేటి సినిమాలు
వాటికి బిన్నంగా తయారైన సినిమా ఇది.
మధ్యతరగతి బంధాలు ఎన్ని సార్లు చుసిన చూడాలనిపిస్తాయి , వాళ్ళ మాటలు, కథలు ఎప్పటికి బోర్ కొట్టవ్ వాటితో పాటు ఈ సినిమా లో తల్లితండ్రులు , నేటి సమాజం చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుత విద్యావ్యవస్థ , దానిలో లోటుపాట్లు , ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని ఈ చిత్రం క్లియర్ గా చెప్తుంది.
ఈ చిత్రం లో అంతర్లీనంగా మంచి మెసేజ్ ఉంది కానీ దర్శకుడు ఎక్కడ కూడా క్లాస్ పీకుతున్నట్టు ఉండదు ఎందుకంటే కధనంలో వినోదానికి ఢోకా లేకుండా చూసుకోడం వల్లనే
ఈ సినిమా లోని ముఖ్య పాత్రలని మనం చాలా తొందరగా రిలేట్ చేసుకుంటాం, అర్ధవంతమైన సంభాషణలు , అందరూ మనసు పెట్టి పనిచేయడం ఈ సినిమాకి ఉన్న ప్రధాన బలం
పిల్లల చిన్నతనంలోనే ఏదైనా అంశం మీద వ్యతిరేకం లేదా అనుమానం బలపడితే దాన్ని మార్చలేం. మార్చడం కూడా అంత తేలిక కాదు అని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం & దర్శకుడు ఆ విషయం లో 100 /100 శాతం విజయం సాధించాడు.

Read Also : కల్కి 2898 ఏడీ  మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

నటీనటుల పనితీరు

మంచి కథకి, మంచి పాత్ర కి మంచి నటీనటులు దొరికితే సినిమా ఎలా ఉంటాడో ఈ సినిమా ఒక నిదర్శనం
సరస్వతి పాత్రలో నివేదా ఎంత చక్కగా ఒదిగిపోయింది అని చెప్పడానికి మాటలు సరిపోవు
తన సొంత డబ్బింగ్ తో చిత్తూర్ యాస లో డైలాగ్స్ చెప్తూ, హావభావాలు పలకరిస్తుంటే, కొన్ని చోట్ల తెలీకుండానే కళ్ళు చెమర్చుతాయి. ఇంత మంచి నటిని తెలుగు దర్శకులు సరైన పాత్రలు ఇవ్వడంలేదేమో అని అనిపించకమానదు.

సరస్వతి భర్త గా తనకిచ్చిన పాత్రలో బాగా నటించాడు. ఇక చిన్న పిల్లాడి పాత్ర అరుణ్ గమ్మత్తుగా , అమాయకంగా బాగా చేసాడు. తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన మంచి నటుడు ప్రియదర్శి అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈగోయ్స్టిక్ టీచర్ గా నెగటివ్ షేడ్స్ లో చక్కగా నటించాడు. మిగిలిన పాత్రలన్నీ సరిగ్గా ఒదిగిపోయాయి.
సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించాడు. సినిమా లో సందర్భానికి తగ్గట్టుగా వచ్చే ప్రతి పాత ఆణిముత్యమే. సినిమాటోగ్రఫీ కూడా కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా ని నిర్మించడానికి ముందుకి వచ్చిన నిర్మాతలకి నిజంగా ధన్యవాదాలు.

దర్శకుడు నందకిషోర్ ఎంతో చక్కగా రాసుకున్న పాత్రలు, ఎమోషన్స్ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లగల దర్శకుడు

చివరగా
35 – ఇది నిజంగానే చిన్న కథ కాదు
Filmy Bowl Rating: 3.25/5

Follow us on Instagram

The post 35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/35-chinna-katha-movie-full-review/feed/ 0
కల్కి 2898 ఏడీ  మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/prabhas-kalki-2898-ad-movie-full-review/ https://filmybowl.com/telugu/prabhas-kalki-2898-ad-movie-full-review/#respond Thu, 26 Sep 2024 06:12:44 +0000 https://filmybowl.com/telugu/?p=375 Prabhas Kalki 2898 AD Review : కల్కి 2898 ఏడీ  (Prabhas Kalki 2898 AD) మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, శోభన, సస్వత ఛటర్జీ, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు ప్రొడక్షన్: వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్స్: అశ్వనీదత్ చలసాని రైటర్ & డైరేక్షన్: నాగ్ అశ్విన్ మ్యూజిక్: సంతోష్ నారాయణన్ రిలీజ్...

The post కల్కి 2898 ఏడీ  మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Prabhas Kalki 2898 AD Movie Full Review
Prabhas Kalki 2898 AD Movie Full Review

Prabhas Kalki 2898 AD Review :

కల్కి 2898 ఏడీ  (Prabhas Kalki 2898 AD) మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, శోభన, సస్వత ఛటర్జీ, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు
ప్రొడక్షన్: వైజయంతి మూవీస్
ప్రొడ్యూసర్స్: అశ్వనీదత్ చలసాని
రైటర్ & డైరేక్షన్: నాగ్ అశ్విన్
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
రిలీజ్ డేట్: జూన్ 27, 2024
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం కల్కి. భారతీయ చలనచిత్ర గర్వించదగ్గ దిగ్గజాలైన అమితాబ్ బచ్చన్ , కమల్ హస్సన్ , ప్రభాస్ లని ఒకచోటికి చేర్చి మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం లో అశ్వినీదత్ నిర్మించిన భారీ సైఫై ఫాంటసీ చిత్రం ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను ‘కల్కి’ ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వెల సంవత్సరాలు తర్వాత ఈ భూమి మీద కాశీ చివరి నగరంగా మారి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక జనం అల్లాడిపోతుంటారు. దీనికి అన్నిటికి కారణం సుప్రీమ్ యాస్మిన్ (కమల్). ప్రజల దగ్గరున్న వనరులన్నీ లాగేసుకొని కాంప్లెక్స్ అనే మరొక ప్రపంచం కట్టేసుకుని నియంతలాగా పరిపాలిస్తుంటాడు. ప్రపంచం లో ఎక్కడ లేని సౌకర్యాలు అన్ని ఆ కాంప్లెక్స్ లోనే ఉండటం తో ప్రతిఒక్కరు ఆ కాంప్లెక్స్ లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించే వాళ్లలో భైరవ (Prabahs) ఒకడు.

సుప్రీమ్ యాస్కీన్ చేస్తున్న ఓ ప్రయోగంలో సుమతి (దీపికా పదుకొనే) గర్భవతి అవుతుంది అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వచ్చేస్తుంది. శంబాలా అనే మరో ప్రపంచానికి చెందిన రెబల్స్ సుప్రీమ్ యాస్కిన్ చేస్తున్న అన్యాయాల్ని ఎదురించి కాంప్లెక్స్ వనరులని అందరికి పంచాలని శంబాలా అనే మరొక రహస్య ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడ నుంచి యుద్ధం చేస్తుంటారు. కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న సుమతి కి శంబాలా ప్రజలు అండగా నిలుస్తారు. వీళ్ళతో పాటు అశ్వత్థామ (అమితాబ్) సైతం సుమతి కి రక్షకుడిగా మారతాడు. సుమతిని అప్పగిస్తే కాంప్లెక్స్ కు వెళ్లే అవకాశం వస్తుందని తెలుసుకున్న భైరవ.. సుమతి ని శంబాలా నుంచి తీసుకురావడానికి అక్కడకి వెళ్తాడు. అక్కడకి వెళ్లిన భైరవ…. అశ్వత్థామ తో పాటు శంబాలా నగర ప్రజలని ఎదిరించడానికి సిద్ధపడతాడు. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు.. అస్సలు అశ్వత్థామ ఎవరు, అన్ని వేల సంవత్సరాలు ఎలా జీవించాడు ,సుమతి ని అశ్వత్థామ ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితేంటి , సుప్రీమ్ యాస్కిన్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏంటి, అస్సలు భైరవ కి అశ్వత్థామ కి సంబంధం ఏంటి… ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కల్కి ఎలా ఉంది
సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతాలు సృష్టించడం అందరికి అయ్యే పని కాదు. అది కొద్దీ మందికి మాత్రమే దక్కే అదృష్టం. ఆ అదృష్టం, కష్టం నాగ్ అశ్విన్ బాగానే పడ్డాడు. భారీ కధలు చెప్పడం లో రాజమౌళి దిట్ట , విసువల్ ఎఫెక్ట్ వాడుకోడం లో రాజమౌళి ఒక స్టాండర్డ్స్ సెట్ చేసాడు , ఒక ప్రపంచాన్ని సృష్టించడంలో రాజమౌళి కి సాటి లేరు అనే దగ్గర నుంచి నాగ్ అశ్విన్ కూడా రాజమౌళి లాగ బానే తీసాడే , కొన్ని చోట్ల రాజమౌళి కంటే బానే తీసాడే అని అనిపించుకుంటాడు అనడంలో సందేహం లేదు
అన్నిటిని బాగానే చేసుకొచ్చిన దర్శకుడు కథ చెప్పడం లో మాత్రం కూసింత వెనకపడ్డాడు. బహుశా part2 కోసం దాచి ఉంటాడు అనుకోవచ్చు కానీ నాగ్ అశ్విని కి ప్రధాన బలమైన కథ చెప్పడం లో మాత్రం కాస్త వెనకపడ్డాడు. ఆలా అని ఈ సినిమా ని తీసి పడేయలేం
ఈ కథ పెద్దది పాత్రలు పరిచయం అవసరం, స్టోరీ సెట్ చేయడం అవసరం. ఈ పార్ట్ మొదటి సగం లో దర్శకుడు అదే పని చేసాడు.
పురాణాల్లోని పాత్రలని తీసుకొని , దానికి ఫిక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ ని తలపించే విధంగా తీర్చిదిద్దాడు. కొత్త ప్రపంచాలని ఎంతో కొత్తగా సృష్టించాడు

కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగే పరిణామం నుంచి ఈ కథ మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ వెంటనే ఆరు వేల సంవత్సరాల ముందుకి వెళ్ళిపోయి కొత్త ప్రపంచాలని చూయిస్తూ సినిమా ని ముందుకు నడిపాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తో ప్రభాస్ ఎంట్రీ ఉంటది. ప్రభాస్ & బుజ్జి (కీర్తి సురేష్ వాయిస్) కామెడీ టైం పాస్ అవుతుంటది. ఆన్నిపాత్రలని పరిచయం చేసుకుంటూ మొదటి సగం నింపాదిగా నడిపిన దర్శకుడు రెండో సగం లో ఆ తప్పు చేయలేదు
అమితాబ్ – ప్రభాస్ మధ్య ఫైట్ ఆకట్టుకుంటుంది, ఆ తర్వాత శంబాలా కి వెళ్లడం అక్కడ అమితాబ్ తో మహాభారతం కథని చెప్పించడం. ఎంతో మంది తెలిసిన స్టార్స్ ఈ సినిమా లో ప్రతి ఐదు నిమిషాలకి ఎదురుపడటం చూడ ముచ్చటగా ఉంటుంది.

ఇప్పటి దాకా ఒక ఫ్లో లో నడిచిన సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. వచ్చే సన్నివేశం, ఇచ్చే ఎలేవేషన్ , తెర మీద కనపడే గ్రాఫిక్స్ అత్యద్భుతం అనే చెప్పాలి. క్లైమాక్స్ లో ప్రభాస్ మరొక పాత్ర ని ప్రవేశపెట్టిన విధానం చెప్పడం కంటే చూసి తీరాల్సిందే

Read Also :  నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో

నటీనటులు ఎలా చేసారంటే
ఎవరేం అనుకున్న ప్రభాస్ కంటే ఈ పార్ట్ లో అమితాబ్ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉండటం గమనించాలి
అది ఒప్పుకొని సినిమా ని ముందుకు తీసుకెళ్లిన ప్రభాస్ అభినందనీయుడు. గత 15 ఏళ్లలో అమితాబ్ ని ఇంత పవర్ఫుల్ గా ఎవరు చూపించలేదు అంటే అతిసేయోక్తి కాదు. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ , యాక్షన్ ఘట్టాల్లో ఇరగదీసాడు అనే చెప్పుకోవాలి. సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ గేతుప్ బావుంది కాకపోతే ఆ పాత్ర నిడివి ఈ పార్ట్ లో చాల తక్కువ. గర్భిణీ గా దీపికా నటన ఆకట్టుకుంటది. శంబాలా ప్రపంచానికి చెందిన రెబెల్స్ గా శోభన , రాజేంద్రప్రసాద్ , అన్నబెన్ , పశుపతి పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు

నాగ అశ్విన్ టీం వర్క్ సూపర్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ , సంగీతం, విసువల్ ఎఫెక్ట్స్ పనితనం కనపడుతుంది.
అశ్వనీదత్ ఖర్చుకి వెనకాడకుండా ఇంత భారీ సినిమా ని ప్రేక్షకులకి అందించడం లో ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే

చివరగా
కల్కి – ప్రపంచ సినిమా చరిత్రలో నిలిచిపోయే తెలుగు సినిమా
Filmy Bowl Rating: 3.75/5

Follow us on Instagram

The post కల్కి 2898 ఏడీ  మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-kalki-2898-ad-movie-full-review/feed/ 0