Business details of Allu Arjun Pushpa 2
MOVIE NEWS

Allu Arjun Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

Business details of Allu Arjun Pushpa 2
Business details of Allu Arjun Pushpa 2

Allu Arjun Pushpa 2 : అల్లు అర్జున్ ,సుకుమార్ కలయిక ఎలాంటిదో పరిచయం అక్కర్లేదు. ఆర్యతో ఇండస్ట్రీ మొత్తాన్నీ తమ వైపు తిప్పుకున్న హీరో & డైరెక్టర్. ఆర్య 2 అంతగా ఆడకపోయిన ఆ సినిమా పాటలు, సుకుమార్ టాలెంటెడ్ రైటింగ్ సీన్స్ ఇప్పటికి కనిపిస్తూనే ఉంటాయి.

ఇక ముచ్చటగా మూడోసారి కలిసి చేసిన సినిమా పుష్ప. ఆ సినిమా ఏం చేసింది, సీక్వెల్‌కి ఎలాంటి హైప్‌ని క్రియేట్ చేసిందో మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అనే చెప్పాలి.

ఇప్పుడు ఆ సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమా బిజినెస్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

పుష్ప ది రూల్ డిసెంబర్ నెల 6వ తేదీన విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. అదే సమయం లో గేమ్ ఛేంజర్ సినిమా ఉన్నా ఈ సినిమా రిలీజ్ విడుదల తేదీలో అయితే ఎటువంటి తేడా ఉండదని మరోసారి స్పష్టం చేసారు.

ఇక సినిమా విడుదల అవుతుందనడంతో పుష్ప2 బిజినెస్ మీద చాలా లెక్కలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కేవలం హిందీ టార్గెట్ 250 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. నార్మల్ గా ఏ సినిమా అయినా ఇండస్ట్రీ హిట్ కావాలంటే ఒక లెక్క ఉంటుంది కానీ పుష్ప కి ఇండస్ట్రీ హిట్ అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్తున్నారు.

Read Also : స్పిరిట్…. యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తోనే

ఈ సినిమాకు దాదాపు గా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తుంది.

టాలీవుడ్ లో ఇంతక ముందు ఏ సినిమాకు జరగనంత స్థాయి లో పుష్ప 2 కి బిజినెస్ జరుగుతోందని అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ ను దున్నేయాలని కామెంట్లు వినపడుతున్నాయి.

పుష్ప ది రూల్ సినిమాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడేళ్ల సమయం కేటాయించగా ఇకపై సినిమాల తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పుష్ప 2 తర్వాత బన్నీ…. త్రివిక్రమ్ కాంబో మూవీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా 2025 ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Follow us on Instagram

Related posts

విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??

filmybowl

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

murali

పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!!

murali

Leave a Comment