స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన కామెడీతో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు..ఒకప్పుడు టాలీవుడ్ లో బ్రహ్మానందం కామెడీ లేకుండా సినిమాలు వచ్చేవి కావు..అప్పటి దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకంగా కొన్ని కామెడీ సీన్ లు సైతం రాసుకునేవారు..ఆయన స్టార్ హీరోలందరి చిత్రాల్లో కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి పలు అవార్డులు కూడా పొందారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వున్న మీమర్స్ అందరికి బ్రహ్మీ నిజమైన గాడ్ అని చెప్పాలి.
ప్రభాస్ “ఫౌజీ”లో మరో స్టార్ బ్యూటీ..కానీ అతిధి పాత్రేనా..?
వయసు రీత్యా బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు తగ్గించేసారు.. కానీ సోషల్ మీడియాలో ఆయనపై వచ్చే మీమ్స్ రూపంలో ఆయన అందరిని నవ్విస్తూ వచ్చారు.. మీమర్స్ అందరికి బ్రహ్మీ తన సినిమాలతో అసలైన స్టఫ్ ఇచ్చారు..ఇటీవల బ్రహ్మానందం మళ్ళీ సినిమాలలో నటించడం ప్రారంభించారు..రీసెంట్ గా కల్కి, గేమ్ చేంజర్ వంటి సినిమాలలో బ్రహ్మీ తన కామెడీతో అలరించారు. అయితే తాజాగా బ్రహ్మానందం, ఆయన కొడుకు గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మా ఆనందం’. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హెలక్కల్, కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం తన సహజ నటనతో ఆకట్టుకున్నారు..బ్రహ్మీ నటనకు సినీ ప్రియులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘బ్రహ్మా ఆనందం’ సినిమాపై ఎన్టీఆర్ ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ”ఈ సినిమా గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను. రాజా గౌతమ్,, బ్రహ్మానందం గారు , అలాగే మూవీ టీమ్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను” అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ కి బ్రహ్మానందం ఫన్నీ రిప్లై ఇచ్చారు .. ”ఈ ఫీలింగ్ ఏంట్రా గుండె ఏదో వణుకుతున్నట్లు ఉందిరా” అని అదుర్స్ డైలాగ్ పోస్ట్ చేసారు..ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి..