పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898AD”.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించునున్నట్లు సమాచారం.
Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!!
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది..‘కల్కి 2898 ఏ.డి’ లో ప్రభాస్ సరసన దిశా పటానీ నటించిన సంగతి తెలిసిందే.. కానీ ప్రభాస్ తో దిశా పటాని కొద్దీ సేపే స్క్రీన్ షేర్ చేసుకుంది..కనిపించిన కొద్ది సేపైనా దిశా తన గ్లామర్‌తో ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ‘ఫౌజీ’ సినిమా లో వీరిద్దరీ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని సమాచారం..‘ఫౌజీ’ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతుంది.. ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ నీ చూస్తారని దర్శకుడు హనురాఘవపూడి తెలిపారు..
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘బ్రహ్మ రాక్షస్’ వంటి భారీ సినిమాలు వున్నాయి.. ఇవన్నీ పూర్తి అవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి..ఇన్ని భారీ సినిమాలు లైన్ లో ఉండటంతో ప్రభాస్ డేట్స్ ఇప్పట్లో కుదిరే ప్రసక్తే కనిపించడం లేదు.. ప్రభాస్ రానున్న రెండేళ్ల లో కనీసం మూడు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు..