Thaman Pawan Kalyan OG : కొన్ని సినిమాల గురించి మాట్లాడుతుంటే తెలియని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అది ఆ కాంబినేషన్ వల్ల కావచ్చు లేదా చాలా రోజుల తర్వాత ఆ హీరోని చూస్తున్న విధానం కావచ్చు. అలా తెలియకుండానే అందరిలో ఒక సినిమా పైన బ్లాక్ బస్టర్ అయింది అనే అభిప్రాయం తెచ్చుకున్న సినిమా OG
ఫ్యాన్స్ కి అంటే వాళ్ల హీరో చేసే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ లాగే కనపడుద్ది కాకపోతే ఓజీకి మాత్రం మొదటి నుంచి కామన్ ఆడియన్స్ దెగ్గర కూడా ఇదే మాట వింటున్నాం. ఇప్పుడదే మాట ఆ సినిమా సంగీత దర్శకుడు కూడా చెప్తున్నాడు .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం
OG. ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ డ్రామా ఇది. చాలా ఏళ్ళ తర్వాత పవన్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ ఫిల్మ్ & తన మార్క్ యాక్షన్ స్టైలిష్ సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి
ఈ సినిమా దర్శకుడు సుజీత్…. పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్. ఇంక అలాంటిది దర్శకుడైతే పవన్ ఫ్యాన్స్ కి పండగ గాక ఇంకేంటి.
Read Also : మట్కా టీజర్ ఎలా వుందంటే
ఇక OG సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది పవన్ దీనిని త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయనున్నారు
ట్విట్టర్ లో ఈ సినిమా గురించి పవన్ అభిమానులు సంగీత దర్శకుడు తమన్ ని అడగగా. థమన్ చెప్పిన ఒకటే మాట ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఓజి అప్డేట్స్ అతి త్వరలోనే వస్తాయని ఈ సినిమా కోసం సుజీత్ పక్కా ప్లానింగ్ లు చేస్తున్నాడు. కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అన్ని అప్డేట్స్ తో కలుద్దాం అని థమన్ గ్యారెంటీ అందించాడు.
దీనితో పవన్ ఫ్యాన్స్ థమన్ కాన్ఫిడెన్స్ చూసి మా వాడికి బ్లాక్ బస్టర్ ఖాయం అని ఆనందంలో ఉన్నారు.
ఈ చిత్రంలో సరిపోదా శనివారం ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Follow us on Instagram