MOVIE NEWS

పుష్ప 3 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ తన కెరీర్ లోనే ఊహించని హిట్ అందుకున్నాడు.. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో పుష్ప మూడో పార్ట్ కి సంబంధించి మేకర్స్ అదిరిపోయే లీడ్ ఇచ్చారు.. పుష్ప 3 : ది ర్యాంపే జ్ అనే టైటిల్ తో ఆ సినిమా రానుంది.. అయితే పుష్ప 2 తరువాత కాస్త గ్యాప్ తీసుకోని అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మొదలు పెడుతున్నాడు..

క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!!

ముందుగా త్రివిక్రమ్ తో సినిమా సెట్ చేసుకున్నాడు అనుకుంటే సీన్ లోకి డైరెక్టర్ అట్లీ వచ్చాడు..దీనితో త్రివిక్రమ్ మూవీ హోల్డ్ లో పెట్టి అట్లీ మూవీలో నటించేందుకు బన్నీ ఆసక్తి చూపించాడు.. అట్లీ గతంలో జవాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు.. అయితే పుష్ప 3 కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిర్మాతలని వారి ప్రతీ సినిమా ఫంక్షన్ లో అప్డేట్స్ అడుగుతూ వస్తున్నారు.. టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెడుతుంది..

తాజాగా వారి నిర్మాణ సంస్థ లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ జాట్ “ ఈవెంట్ లో నిర్మాత నవీన్ పుష్ప 3 పై అప్డేట్ ఇచ్చారు..దర్శకుడు సుకుమార్ రాంచరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు..అది పూర్తి అయిన తరువాత 2027 లో పుష్ప 3 షూటింగ్ ఉంటుంది..అల్లుఅర్జున్, అట్లీ మూవీ షూటింగ్ కూడా త్వరలో ఉంటుంది.. అయితే ఆ సినిమా మేము నిర్మించడం లేదు.. పుష్ప 3 సినిమా 2028 లో రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు..

 

Related posts

అకిరా నందన్ తో ఖుషి 2..ఎస్.జె సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..?

murali

OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..?

murali

Leave a Comment