MOVIE NEWS

ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ అలాగే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్‌ 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఎప్పుడు అప్‌డేట్‌లు వస్తాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి షేర్ చేసారు.ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోస్తూ.. వైట్ బోర్డు బయటకు వచ్చిందంటే ఆయన స్క్రిప్ట్ వర్క్ పూర్తి స్థాయిలో జరుగుతుందని మాకు తెలుసని అర్థం. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆమె తెలిపింది. దీనికి రేరింగ్‌ టు రోర్‌, వర్క్‌ఫ్రమ్‌హోం అనే హ్యాష్‌ట్యాగ్స్‌లను లిఖిత రెడ్డి జత చేసారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Related posts

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

murali

రామాయణాన్ని ఇలా వాడేశారు

filmybowl

బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!!

murali

Leave a Comment