MOVIE NEWS

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర’’. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు.. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ దేవర సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

దేవర సక్సెస్ తో ఎన్టీఆర్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే.రీసెంట్ గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న  వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు..

తాజగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది..ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ పోస్టర్ రానున్నసంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.. జనవరి నుండి ఎన్టీఆర్ వార్ -2 షూటింగ్ లో పాల్గొంటూనే నీల్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అని ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ టైటిల్ నే అఫీషియల్ గా ప్రకటిస్తారని సమాచారం…కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..

Related posts

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

murali

బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

filmybowl

సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment