MOVIE NEWS

నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

SVSC : పూల కుండీ సీన్ రీ క్రియేట్ చేస్తున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్..!!

నెటిజెన్లు కూడా ఈ టీజర్ లోని డైలాగ్స్ తప్పొప్పుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ టీజర్ లో నాని గెటప్ చాలా డిఫరెంట్ గా వుంది.. రెండు జెడలు వేసుకొని నాని ఎంతో గంభీరంగా కనిపించాడు..అయితే నాని ఫేస్ వీడియో లో సరిగ్గా చూపించకపోయినా పొడవాటి జడలతో నానిని చూపించిన న విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..

ఇది 1980ల నాటి కథ అని సికింద్రాబాద్ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం..ఇందులో నాని అనగారిన గిరిజన వర్గానికి చెందిన నాయకుడిగా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తాడట..నాని పాత్రని దర్శకుడు ఎప్పుడు చూడనంత కొత్త చూపించబోతున్నట్లు సమాచారం..

 

 

 

Related posts

దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!!

murali

ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!!

murali

దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment