MOVIE NEWS

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు.రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసాడు.. క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు..

పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!!

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి టీజర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. ఇండియన్ సినీ హిస్టరీ లోనే ఇప్పటివరకు చేయని అద్భుతాన్ని గేమ్ ఛేంజర్ ఆవిష్కరించబోతుంది.. డిసెంబర్ 21న అమెరికాలో ‘ గేమ్ ఛేంజర్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరుపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కర్టిస్ కల్‌వెల్ సెంటర్‌, 4999 నామన్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది..చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ కూడా ఈ వేడుకకి హాజరుకాబోతున్నారని సమాచారం.

రామ్ చరణ్‌పై అభిమానంతో రాజేష్ కల్లెపల్లి ఇంత పెద్ద ఈవెంట్‌ను చేయనుండటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఇలా జరగలేదు, ఇకపై జరగబోదు అనేంత భారీ స్థాయిలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఇండియన్ హిస్టరీ లో ఏ సినిమా కూడా ఇప్పటివరకు యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించలేదు.. తొలిసారి “గేమ్ ఛేంజర్” సినిమా కోసం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు..దీనితో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు

Related posts

పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!!

murali

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

ప్రభాస్ ‘రాజసాబ్’ టీజర్ రన్ టైం లాక్..!!

murali

Leave a Comment