MOVIE NEWS

ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొన్ని రోజులుగా వార్‌ 2 సినిమా కోసం ఎన్టీఆర్‌ ముంబైలోనే ఉంటున్నారు. వచ్చే వారం నుంచి ముంబైలో ఓ ప్రత్యేక సెట్‌లో మేకర్స్ హీరో హృతిక్‌ రోషన్‌పై సోలో సాంగ్‌ చిత్రీకరించనున్నారు..ఆ పాట చిత్రీకరణ తర్వాత మేకర్స్ ఎన్టీఆర్‌పై కీలక యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్‌ జరిపే అవకాశాలు ఉన్నాయని సమాచారం..

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

అలాగే ఎన్టీఆర్‌ మరో రెండు వారాల పాటు వార్‌ 2 సినిమా కోసం ముంబైలోనే ఉండనున్నాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వార్‌ 2 సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.వార్‌ 2 సినిమాను 2025 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..యశ్‌ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఎలాంటి ఆలస్యం కాకుండా ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడు

Related posts

‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!

murali

గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!

murali

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

Leave a Comment