గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..దీనితో మెగా ఫ్యాన్స్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. “RC 16” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమాలో కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా ఎన్నో ఆటలు ఈ సినిమాలో ఉంటాయని అయితే రాంచరణ్ ఈ సినిమాలో “ఆటకూలీగా” కనిపిస్తాడని సమాచారం..అయితే ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా RC16 నుంచి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అయింది…
ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!!
దర్శకుడు బుచ్చి బాబు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం RC 16 టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ ను కూడా రెడీ చేస్తున్నారని, అందుకోసం సపరేట్‌గా ఓ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..మార్చి 27 న రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఉదయం 9.09 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ లాక్ చేశారని తెలుస్తుంది..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు