ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “ పుష్ప 2 “ సినిమా డిసెంబర్ 5 న విడుదలయి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తుంది.. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు..కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. అయితే పుష్ప 2 సినిమా ఇంతటి ఘన విజయం సాధించినా కూడా అల్లుఅర్జున్ కానీ, సుకుమార్ కానీ, మూవీ మేకర్స్ కానీ అంత సంతోషంగా లేరు.. దీనికి కారణం సినిమా రిలీజ్ రోజు జరిగిన ఓ విషాదకరమైన ఘటన..
పుష్ప 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసారు.. దీనిలో భాగంగా డిసెంబర్ 4 అర్దరాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి.. అయితే పుష్ప 2 ను ఫ్యాన్స్ తో కలిసి వీక్షించేందుకు అల్లుఅర్జున్ పుష్ప 2 టీం తో ఆరోజు అర్ధరాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వచ్చారు.. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అల్లుఅర్జున్ అక్కడికి రావడంతో భారీగా జనం గూమిగుడారు.. దీనితో తొక్కిసలాట జరిగింది.. ఆ తొక్కిసలాటలో ఓ కుటుంబంలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!
అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు అర్జున్ పై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసారు.. అయితే ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్‌ను సైతం చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు..