MOVIE NEWS

బార్బెక్యూ నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ పండ‌గ‌ ప్రారంభం

భారత్‌లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషన్ ‘ది గ్రేట్ గ్రిల్ లూట్ ఫెస్డివల్’ ప్రారంభించింది. ఇది పైరేట్ నేపథ్య సీఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్‌. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఔట్‌లెట్లలో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఉన్న బార్బిక్యూ నేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నాయుడు ముత్తులూరు మాట్లాడుతూ ..

ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు వినూత్నమైన, ప్రేరణాత్మకమైన డైనింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్నారు. ఆహార ప్రియులకు విశేషమైన సీఫుడ్ అనుభూతిని అందచనున్నామని తెలిపారు. పైరేట్ థీమ్‌కు జీవం పోస్తూ.. మెనూను రుచికరమైన వంటకాలతో సిద్ధం చేశామన్నారు. గోల్డెన్ ఫ్రైడ్ కాలమారి విత్ స్పైసీ మాయో, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ కాజున్ సాస్ లాంటి క్రిస్పీ వంటకాలు నోరూరించనున్నాయని చెప్పారు. తందూరీ క్రాబ్, తాజా పీతలను మసాలాలతో మెరినేట్ చేసి తందూరిలో కాల్చి అందించనున్నామని తెలిపారు.

కొత్తిమీర సాస్‌లో టాస్ చేసిన తీయటి రొయ్యల రుచిని ఆస్వాదించవచ్చన్నారు. ఇక శాకాహారుల కోసం వివిధ రుచులు అందుబాటులో కలవన్నారు. తీపి, పుల్లని సాస్‌లో వాటర్ చెస్ట్‌నట్, బీట్‌రూట్ రోల్స్, క్రిస్పీ స్వీట్ పొటాటో, ఆఫ్ఘని పనీర్ టిక్కా శాఖాహారులను ఖుషి చేయనున్నాయని చెప్పారు. ఏదైనా అదనపు ప్రత్యేకతను కోరుకునే వారికి లాబ్ స్టార్ లా కార్టే ఆధారంగా అందజేయనున్నామన్నారు.

ప్రధాన కోర్సు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. సీఫుడ్ బిర్యాని ఇది తక్కువ మసాలాలతో తయారైన ఈ బిర్యానీలో రొయ్యలు, చేప, స్క్విడ్, ఆక్టోపస్ వంటి సముద్రపు రుచులతో ఉంటుందని తెలిపారు.‌ దీనికి కుంకుమపువ్వు సువాసన అదనపు ఆకర్షణగా ఉంటుందన్నారు. దక్షిణ భారతీయ శైలి పీతలను తీర ప్రాంతంలో ప్రత్యేక మసాలాలతో వండిన వంటకాన్ని ఆస్వాదించవచ్చన్నారు. గ్రిల్ బాసా విత్ లెమన్ బట్టర్ సాస్ అండ్ మాష్డ్ పొటాటో లైట్ గా వేయించిన బాసా ఫిల్లెట్‌ను మృదువైన మాష్డ్ పొటాటోలతో టంగీ లెమన్ బట్టర్ సాస్‌తో రుచి చూడవచ్చన్నారు. శాకాహారులు బేక్ చేసిన పాస్తాను తినవచ్చన్నారు. పచ్చి మసాలాతో తయారైన ఇటాలియన్ శైలి పాస్తా, గ్రీన్ థాయ్ కర్రీ ఇది థాయ్ మసాలాలు, కొబ్బరి పాలను ఉపయోగించి చేసిన కూరగాయల రుచిని ఆస్వాదిం చవచ్చన్నారు.

అంతిమంగా మధురానుభూతితో విందును ముగించేందుకు అతిథులు ఫ్రెష్ ఫ్రూట్ గటో తాజా పండ్లతో పాటు క్రీమ్తో తయారైన కేక్‌ను ఆస్వాదించొచ్చ‌న్నారు. ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా తయారైన సీతాఫల్ కుల్ఫీ, హనీ ఆల్‌మండ్, డేట్ కుల్ఫీ లాంటి రుచికరమైన కుల్ఫీలను రుచి చూస్తూ విందును మరపురానిదిగా చేసుకోవచ్చన్నారు. బార్బిక్యూ నేషన్‌ యాంబియన్స్ ఈ ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుందన్నారు. ఈ అలంకరణ రెస్టారెంట్లను సజీవమైన పైరేట్ ప్రపంచంగా మార్చాయన్నారు. పైరేట్ థీమ్ ఆధారంగా రూపొందించిన ప్రత్యేక అంశాలు, పైరేట్ దుస్తులు ధరించిన సిబ్బందితో ఆకట్టుకుంటాయని తెలిపారు. దీనికి తోడు వినోద కార్యక్రమాలు కూడా కనువిందు చేస్తాయ‌న్నారు.

Related posts

రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

filmybowl

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

murali

పరుశురాం నెక్స్ట్ హీరో అతనేనా….

filmybowl

Leave a Comment