MOVIE NEWS

వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుస సక్సెస్ లు సాధిస్తూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే ఆహా లో వచ్చే బిగ్గెస్ట్ టాక్ షో అయిన అన్ స్టాప్పబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ అదరగొడుతున్నారు.. బాలయ్య హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..టాలీవుడ్ టాప్ స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

అలాగే అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం కష్టపడుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులలో చాలా కాలంగా చర్చ నడిచింది.అయితే హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ఉండాల్సింది.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అభిమానులలో అంచనాలు పెంచిన మోక్షజ్ఞ మొదటి సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు..

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాను పురాణ ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె అయిన తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.అంతా బాగానే వుంది కానీ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.తన కొడుకు సినీ ఎంట్రీ విషయంలో బాలయ్య జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం..అందుకే సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

మోక్షజ్ఞ మొదటి మూవీ స్టోరీ మొత్తం విన్న బాలయ్యకు కథ బాగా నచ్చడంతో వెంటనే షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలివేషన్స్ కూడా బాలకృష్ణకు విపరీతంగా నచ్చాయని సమాచారం. దీనితో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆదేశించారట.అయితే మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ కాలేదు.అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ !

filmybowl

కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!

murali

హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది

filmybowl

Leave a Comment