నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్”.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మూవీని స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ఏకంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఈ సినిమాలో ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు..
ఎస్ఎస్ఎంబి : వర్క్ షాప్ లో మహేష్.. పిక్ అదిరిందిగా..!!
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్‍కు ముందే నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ చేసుకుందని తెలుస్తుంది.అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని సమాచారం..
అయితే ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతున్న ఈ సినిమా అదే తేదీన ఓటీటీలోకి వస్తుందా లేక మరో తేదీన వస్తుందా అనేది తెలియాల్సి ఉంది..ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో “అఖండ 2 : తాండవం” అనే బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది..